జూలై నుంచి విశాఖ నుంచి షాలిమార్, బెంగళూరు మార్గాల్లో ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు!
విశాఖపట్నం నుంచి ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. షాలిమార్, బెంగళూరు మార్గాల్లో స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి.
రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్, అలాగే కర్ణాటకలోని ఎస్ఎంవీటీ బెంగళూరు మార్గాల్లో ప్రత్యేక వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక రైళ్ల సమయాలు, సర్వీసుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం - షాలిమార్ - విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు
రైలు నంబరు 08508 (విశాఖపట్నం – షాలిమార్) ప్రతి మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 3:00 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. జూలై 7 నుంచి సెప్టెంబర్ 29 వరకు మొత్తం 13 ట్రిప్పుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08507 (షాలిమార్ – విశాఖపట్నం) ప్రతి బుధవారం ఉదయం 5:00 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జూలై 8 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 13 ట్రిప్పులు నడుస్తుంది.
ప్రధాన స్టాప్‌లు: ఈ రైళ్లు సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్-కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగాచి స్టేషన్లలో ఆగుతాయి.
విశాఖపట్నం - ఎస్ఎంవిటి బెంగళూరు - విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు
రైలు నంబరు 08581 (విశాఖపట్నం – ఎస్ఎంవిటి బెంగళూరు) ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. జూలై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు మొత్తం 13 ట్రిప్పుల పాటు సేవలు అందిస్తుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08582(ఎస్ఎంవీటీ బెంగళూరు – విశాఖపట్నం) ప్రతి శనివారం మధ్యాహ్నం 3:50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు మొత్తం 13 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
ప్రధాన స్టాప్‌లు: ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో నిలుస్తాయి.
రాబోయే పండుగలు, సెలవుల సీజన్‌లో రద్దీని తగ్గించడానికి ఈ 13 వారాల ప్రత్యేక రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తుగా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


