తెలుగు రాష్ట్రాల్లో రూట్ మారిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. కొన్ని రీషెడ్యూల్.. పూర్తి వివరాలు ఇవే!

కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లోని డోర్నకల్ - గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య పనులు కారణంగా ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే పలు రైళ్ల రూట్లు మారాయి. అంతేకాదు కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Published on: Jun 15, 2026, 18:01:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లోని డోర్నకల్ - గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల నిమిత్తం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనుల కారణంగా ఆగస్టు 2026 నెలలో పలు రూట్లలో నడిచే రైళ్లను డైవర్ట్ చేయడంతో పాటు, మరికొన్ని రైళ్ల సమయాలను రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

రైల్వే అప్డేట్
రైల్వే అప్డేట్

రూట్ మారిన ట్రైన్లు

విశాఖపట్నం - LTT ముంబై (18519/18520): ఆగస్టు 14 నుండి 18 వరకు ఈ రైళ్లు విజయవాడ, గుంటూరు మీదుగా డైవర్ట్ అయ్యాయి. దీనివల్ల కాజీపేట స్టేషన్‌లో వీటికి స్టాపింగ్ ఉండదు.

సీఎస్టీ ముంబై - భువనేశ్వర్ (11019/11020): ఆగస్టు 17, 18 తేదీల్లో నడిచే ఈ రైళ్లను డైవర్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా వెళ్తాయి. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగవు.

మచిలీపట్నం - సాయినగర్ షిరిడీ (17208): ఆగస్టు 18న నడిచే ఈ రైలు డైవర్ట్ అయింది. మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కాజీపేట స్టాపింగ్‌లు రద్దయ్యాయి.

సాయినగర్ షిరిడీ - కాకినాడ పోర్ట్ (17205): ఆగస్టు 18న ఈ రైలు సికింద్రాబాద్ - పగిడిపల్లి - గుంటూరు - విజయవాడ మీదుగా వెళ్తుంది. కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరలలో ఆగదు.

చర్లపల్లి - షాలిమార్ (18046): ఆగస్టు 18, 19 తేదీల్లో ఈ రైలు చర్లపల్లి - పగిడిపల్లి - గుంటూరు - విజయవాడ మీదుగా మళ్లిస్తారు. భువనగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టాప్‌లు ఉండవు.

రేణిగుంట - నిజాముద్దీన్ (00761): ఆగస్టు 14, 15, 17 తేదీల్లో ఈ రైలు రేణిగుంట - గూటి - కాచిగూడ - మౌలా అలీ 'G' - కాజీపేట - బల్హర్షా మీదుగా డైవర్ట్ అయింది. దీనికి గూడూరు, విజయవాడ స్టాపింగ్‌లు రద్దయ్యాయి.

రైళ్ల రీషెడ్యూల్ వివరాలు

విశాఖపట్నం - సికింద్రాబాద్ (20833): ఆగస్టు 15, 17, 19 తేదీల్లో 60 నిమిషాలు ఆలస్యం.

సికింద్రాబాద్ - విశాఖపట్నం (20834): ఆగస్టు 15, 17, 19 తేదీల్లో 60 నిమిషాలు ఆలస్యం.

హైదరాబాద్ - తాంబరం (12760), సికింద్రాబాద్ - తిరుపతి (12764): ఆగస్టు 17న 60 నిమిషాలు ఆలస్యం.

బనారస్ - రామేశ్వరం (22536), రామేశ్వరం - అయోధ్య కాంట్ (22613): ఆగస్టు 16న 60 నిమిషాలు ఆలస్యం.

ఆదిలాబాద్ - తిరుపతి (17406): ఆగస్టు 15, 17, 18 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యం.

తిరుపతి - హిసార్ (04718), హైదరాబాద్ - విశాఖపట్నం (12728): ఆగస్టు 17న 75 నిమిషాలు ఆలస్యం.

న్యూఢిల్లీ - చెన్నై సెంట్రల్ (12622): ఆగస్టు 16న 75 నిమిషాలు ఆలస్యం.

ప్రయాణికులు పైన పేర్కొన్న స్టేషన్ల మళ్లింపులు, సమయాల మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More