Telangana AP Chicken Rates : పవిత్ర శ్రావణమాసం రాకతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చికెన్ మార్కెట్ గ్రాఫ్ మారిపోతోంది. పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక నియమాల కారణంగా చాలా మంది ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటుండటంతో చికెన్‌కు డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దీని ప్రభావం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.
తగ్గుతున్న చికెన్ ధరలు…

కేవలం 10 రోజుల క్రితం వరకు చుక్కలు చూపించిన చికెన్ ధరలు ఇప్పుడు ఒకేసారి దిగివచ్చాయి. పది రోజుల కిందటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.280 నుంచి రూ.300 (కొన్ని ప్రాంతాల్లో రూ.310 దాకా) విక్రయించారు. అయితే శ్రావణమాస నియమాలు ప్రారంభం కావడంతో వినియోగం తగ్గి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కిలో చికెన్ ధర రూ.230 నుంచి రూ.240 పరిధిలోనే లభిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, ప్రాంతాల వారీగా మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే…. ఏపీలోని విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220 నుంచి రూ.240 వద్ద కొనసాగుతోంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ ప్రాంతాల్లోనూ కాస్త అటుఇటుగా ఇదే రేట్లు అమలవుతున్నాయి.
హైదరాబాద్ పరిసరాల్లో స్కిన్‌లెస్ చికెన్ రూ. 240 నుంచి రూ.250 వరకు ఉండగా, లైవ్ కోళ్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ పడిపోవడంతో విక్రయాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపుల వద్ద గిరాకీ చాలా తక్కువగా ఉంటోందని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు….. శ్రావణమాసంలోనూ నాన్-వెజ్ తినే కొద్దిమంది ప్రియులకు, ఇతర సమయాల్లో నియమాలు పాటించేవారికి మాత్రం ఈ ధరల తగ్గుదల ఊరటనిస్తోంది. రాబోయే కొన్ని వారాల పాటు ఇదే శ్రావణ వాతావరణం కొనసాగనుండటంతో చికెన్ ధరలు మరికొన్ని రోజుల పాటు ఇలాగే తక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
{{/usCountry}}మరోవైపు….. శ్రావణమాసంలోనూ నాన్-వెజ్ తినే కొద్దిమంది ప్రియులకు, ఇతర సమయాల్లో నియమాలు పాటించేవారికి మాత్రం ఈ ధరల తగ్గుదల ఊరటనిస్తోంది. రాబోయే కొన్ని వారాల పాటు ఇదే శ్రావణ వాతావరణం కొనసాగనుండటంతో చికెన్ ధరలు మరికొన్ని రోజుల పాటు ఇలాగే తక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
{{/usCountry}}