...
...
Next Story

నిస్వార్థ సేవతోనే నిస్వార్థ ప్రేమ - శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లక్షలాది మంది సేవా మార్గాన్ని అనుసరించేలా శ్రీ సత్యసాయి బాబా ప్రేరణ ఇచ్చారని వ్యాఖ్యానించారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారన్నారు.

Published on: Nov 22, 2025, 13:45:04 IST
Advertisement

శ్రీ సత్యసాయిబాబా లక్షలాది మందిని సేవా మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.

సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము

'మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ' అనే నమ్మకాన్ని సత్యసాయి బాబా ప్రచారం చేశారని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఆయన ఆధ్యాత్మికతను నిస్వార్థ సేవతోను, వ్యక్తిగత పరివర్తనతోను ముడిపెట్టారని అభిప్రాయపడ్డారు. సాయిబాబా లక్షలాది మంది సేవా మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారని చెప్పారు.

ఆధ్యాత్మికతను ప్రజా సంక్షేమంతో అనుసంధానించాలని సత్యసాయిబాబా తన అనుచరులకు విజ్ఞప్తి చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. అనేక దేశాల్లోనూ ఆయన భక్తులు అణగారిన వర్గాలకు సేవ చేయడం ఒక సంతృప్తి ని కలిగించే విషయమని ఆమె అన్నారు. నిస్వార్థ సేవ ద్వారా నిస్వార్థ ప్రేమను అనే సంజేశాన్ని శ్రీ సత్య సాయి బాబా ఇచ్చారని కొనియాడారు.

విశ్వప్రేమకు సత్యసాయి ప్రతిరూపం - రాష్ట్రపతి

‘’అందరిని ప్రేమించాలి… అందరికీ సేవ చేయాలి, ఎల్లప్పటికీ సహాయం చేయాలి, ప్రపంచమే మన పాఠశాల అని సత్యసాయి బాబా విశ్వసించారు. సత్యం, మంచి ప్రవర్తన, శాంతి, ప్రేమ మరియు అహింస అనే ఐదు మానవ విలువలు మన పాఠ్యాంశాలు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు.

ఉదయం 11 గంటలకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలి... ఎవ్వరిని నొప్పించకూడదు అనేది సత్యసాయి బాబా సిద్దాంతం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేది సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలు. సత్యసాయి బాబా చెప్పిన సిద్దాంతాలు.. సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది. ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగు నీటి సౌకర్యాన్ని కల్పించారు. సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉంది” అని గుర్తు చేశారు.

“మానవ సేవే... మాధవ సేవ అనే సిద్దాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తోంది. శాంతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సత్యసాయి బాబా నిలుస్తారు. 7.50 లక్షల వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారు... ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదు. ఇవాళ సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రొగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయి బాబా స్పూర్తితో సేవలందిస్తారు. 140 దేశాల్లో 2 వేలకు పైగా బ్రాంచ్ లు సత్యసాయి బాబా ట్రస్టుకు ఉన్నాయి. సత్యసాయి సాయిబాబు సిద్దాంతాన్ని సర్వత్రా వ్యాపితం చేసేలా కృషి చేయాలి” అని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe