తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి మార్చి 31, ఏప్రిల్ 01 తేదీల్లో జరగనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవోవెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
- భక్తుల భద్రత దృష్ట్యా తుంబురు తీర్థానికి మార్చి 31న మరియు ఏప్రిల్ 1వ తేదీల్లో ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
- పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీటిని 100 మంది శ్రీవారి సేవకులు ద్వారా పంపిణీ చేస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
- తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు, దీర్ఘవ్యాధిగ్రస్తులకు, గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.
- భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
- పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
- తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}