కార్తిక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఆలయ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వీఐపీల కంటే సామాన్య భక్తులకు త్వరితగతిన, సులభంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఆలయ దర్శన వేళలు, సేవల్లో కీలక మార్పులు ప్రకటించారు.

భక్తుల రద్దీని బట్టి వారంలో వేర్వేరు రోజుల్లో వేర్వేరు దర్శన విధానాలను అమలు చేయనున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. శని, ఆది, సోమవారాల్లో విపరీతమైన భక్తుల రద్దీ ఉండే రోజుల్లో కేవలం అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సామాన్య భక్తుల దర్శన వేళలకు అంతరాయం కలగకుండా నెల రోజుల పాటు పలు ఆర్జిత సేవలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది దేవస్థానం. రద్దీ రోజుల్లో నిర్వహించే రూ.5,000 గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు.
ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1,000 కుంకుమార్చన సేవను భక్తుల సౌకర్యార్థం ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు.
ఆలయంలో జరిగే ఆర్జిత హోమాలు, నిత్య కళ్యాణోత్సవ సేవలు ఎలాంటి మార్పులు లేకుండా నిర్దేశిత సమయాల్లో కొనసాగుతాయి. భక్తుల కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలను ప్రవేశపెట్టారు. సేవా రుసుము కేవలం రూ. 216 మాత్రమే. ఒక టికెట్‌పై దంపతులు లేదా ఒక వ్యక్తికి అభిషేకానికి అనుమతిస్తారు.
ఏపీటీఎస్ అధికారిక వెబ్‌సైట్: www.tms.ap.gov.in ద్వారా లేదంటే.. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా టికెట్లను సులభంగా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. నవంబరు 10 నుండి డిసెంబరు 9 వరకు కార్తిక మాసోత్సవాలు జరగనున్నాయి. నవంబరు 24 నాటి సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వైభవంగా కోటి దీపోత్సవం జరగనుంది. కార్తిక మాసం సందర్భంగా భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆలయ నిబంధనలను పాటించి స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}ఏపీటీఎస్ అధికారిక వెబ్‌సైట్: www.tms.ap.gov.in ద్వారా లేదంటే.. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా టికెట్లను సులభంగా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. నవంబరు 10 నుండి డిసెంబరు 9 వరకు కార్తిక మాసోత్సవాలు జరగనున్నాయి. నవంబరు 24 నాటి సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వైభవంగా కోటి దీపోత్సవం జరగనుంది. కార్తిక మాసం సందర్భంగా భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆలయ నిబంధనలను పాటించి స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}