Srisailam Dam Water Level : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద - ప్రస్తుత నీటిమట్టం ఎంతంటే…?

Srisailam Dam Water Level Updates : శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.

Published on: Sep 5, 2026, 14:00:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Srisailam Dam Water Level Updates : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి రాక స్వల్పంగా కొనసాగుతోంది. ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన నేటి ఉదయం నివేదిక ప్రకారం…. డ్యామ్‌లోకి ఇన్ ఫ్లో (వరద ప్రవాహం) 2,815 క్యూసెక్కులుగా నమోదైంది. అదే సమయంలో రిజర్వాయర్ నుంచి దిగువకు 49,090 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫొటో)
శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫొటో)

నీటిమట్టం వివరాలు…

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 869.501 అడుగులకు చేరింది. వరద ప్రవాహాలు మందగించడం, నీటి వినియోగం క్రమబద్ధీకరించడం వల్ల ప్రాజెక్టు పరిధిలోని కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. నాగార్జునసాగర్ దిగువ అవసరాలకు అనుగుణంగా ఔట్ ఫ్లో విడుదల కొనసాగుతోంది.

  • ప్రస్తుత నీటిమట్టం: 869.501 అడుగులు
  • నీటి నిల్వ: 139.631 టీఎంసీలు
  • ఇన్‌ఫ్లో (వచ్చే నీరు) : 2,815
  • ఔట్‌ఫ్లో (వెళ్తున్న నీరు): 49,090 క్యూసెక్కులు.

కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలానికి వచ్చే నీటి శాతం భారీగా పడిపోయింది. ఎగువ నుంచి కొత్తగా వరద నీరు వచ్చి చేరితే తప్ప శ్రీశైలంలో నీటిమట్టం తిరిగి పుంజుకునే అవకాశం లేదు.

మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 15,723 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 535.699(పూర్తిస్థాయి నీటి మట్టం 590) అడుగులుగా నమోదు కాగా… నీటి నిల్వ 179.488(పూర్తి సామర్థ్యం 312.05 ) టీఎంసీలుగా ఉంది.

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కీలకమైన శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకునే దిశగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను సిద్ధం కూడా చేశాయి. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ కేఆర్ఎంబీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తాగు నీటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More