Srisailam Water Level : శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద - నీటిమట్టం వివరాలు ఇలా
Srisailam Water Level : ఎగువ పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం(ఇవాళ్టి ఉదయం రిపోర్ట్) జలాశయం నీటిమట్టం 871.801 అడుగులకు చేరగా... నీటినిల్వ 149.419 టీఎంసీలుగా ఉంది.
Srisailam Water Level : ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీటి ప్రవాహం స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం(సెప్టెంబర్ 1) ఉదయం నమోదైన వివరాల ప్రకారం జలాశయానికి 13,544 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతోంది.

నీటిమట్టం వివరాలు ఇలా…
వరద ప్రవాహం పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 871.801 అడుగులకు చేరింది. ఇక జలాశయంలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 149.419 టీఎంసీలుగా నమోదైనట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.
మరోవైపు శ్రీశైలం నుంచి దిగువకు ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కాలువల ద్వారా 13,111 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాల సూచనలు ఉన్నందున రానున్న గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 15,582 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 536.201(పూర్తిస్థాయి నీటి మట్టం 590) అడుగులుగా నమోదు కాగా… నీటి నిల్వ 180.503(పూర్తి సామర్థ్యం 312.05 ) టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో 15,582 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కీలకమైన శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకునే దిశగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను సిద్ధం కూడా చేశాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

