...
...
Next Story

శ్రీశైలం వెళ్తున్నారా? అక్కడ ఈ పనులు చేయకూడదు, తెలుసుకుని వెళ్లండి!

శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయకూడదని ఈవో శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు మరికొన్ని విషయాలపై నిషేధం విధించారు.

Published on: Dec 22, 2025, 11:04:22 IST
Advertisement

శ్రీశైలం దేవస్థానంలో అనుమతి లేకుండా రీల్స్, వీడియోలు చిత్రీకరించడం, డ్రోన్‌లను ఎగురవేయడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీశైలం దేవస్థానం ప్రకటించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రావు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిబంధనల ప్రకారం దేవాలయ ప్రాంతంలో ఇతర మతాల ప్రచారం చేయడం, ఇతర మతాలకు సంబంధించిన కరపత్రాలు లేదా పుస్తకాలు పంపిణీ చేయడం, ఇతర మతాల చిహ్నాలను ధరించడం లేదా ప్రదర్శించడం నిషేధమని తెలిపారు.

శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలం దేవస్థానం

అదేవిధంగా ఆలయంలో పరిసర ప్రాంతాలైన మాడ వీధులు, ఉప ఆలయాలు, పాతాళగంగ, పంచమఠాలు, శిఖరేశ్వరం, హటకేశ్వరం, పాలధార - పంచధార, సాక్షి గణపతి ఆలయం తదితర ప్రాంతాలలో ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్‌లను ఎగురవేయకూడదు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి రీల్స్ రికార్డ్ చేయడం కూడా నిషేధమని అన్నారు.

ఆలయ ప్రాంగణంలో మద్యం సేవించడం లేదా మాంసాహారం తినడం, ధూమపానం చేయడం, జూదం ఆడటం లేదా ఇతర సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడటం కూడా నేరమే. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీశైలం దేవస్థానం ప్రకటించింది.

శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులు ఈ నిబంధనలను పాటించి దేవస్థానం సహకరించాలని ఈవో శ్రీనివాసరావు కోరారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్యమత ప్రార్ధనలు చేయడం, ప్రచారాలు నిర్వహించడం కూడా నిషేధమని పేర్కొన్నారు. భక్తులకు ఎవరూ ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు.

ఇటీవల శ్రీశైలం దేవాలయం ప్రాంగణంలో ఓ యువతి రీల్స్ చేసి సోషల్ మీడియాలో దుమారం రేపింది. శ్రీశైలం ఆలయ నిబంధనలు ఉల్లంఘించారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రీల్స్ చేశారని నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ట్రోల్స్ మీద యువతి స్పందించింది. సాంప్రదాయంగానే చీర కట్టుకుని రీల్స్ చేశాను అని, శ్రీశైలం ఆలయంలో రీల్స్ చేయలేదని తెలిపింది. తప్పు జరిగి ఉంటే క్షమించండి అని వివరణతో వీడియో విడుదల చేసింది. ఈ విషయంపై దేవస్థానం సీరియస్ అయింది. వీడియోలు, రీల్స్‌తోపాటుగా మరికొన్ని విషయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe