శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల కోసం ఒక విశేష అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్‌లో జరగనున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 1,000 ఇయర్స్ ఆఫ్ అన్‌బ్రోకెన్ ఫెయిత్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రత్యేక తీర్థయాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది.

సోమనాథ్ ఆలయంపై చారిత్రక దాడి జరిగి 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని, అలాగే భారత స్వాతంత్య్రానంతరం ఈ మహా క్షేత్రాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, ధర్మం, విశ్వాసాల పునరుజ్జీవనానికి సంకేతంగా నిలిచే ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యేందుకు శ్రీశైల క్షేత్రం నుండి సుమారు 50 మంది భక్తులను ఎంపిక చేయాలని దేవస్థానం నిర్ణయించింది.
ఈ ప్రత్యేక తీర్థయాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తమ వివరాలతో పాటు గుర్తింపు కార్డు ప్రతిని (ఐడీ ప్రూఫ్) ఆగస్టు 30వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5:00 గంటలలోపు శ్రీశైలం దేవస్థానంలోని పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్‌లో అందజేయాలని అధికారులు సూచించారు.
తీర్థయాత్రకు హాజరయ్యే భక్తులు భౌతికంగా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవస్థానం తెలిపింది. ఎటువంటి తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రమే ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రయాణ సమయం సుదీర్ఘంగా ఉండటం, యాత్రా ప్రాంగణాల్లో కాలినడకన ప్రయాణించాల్సి రావడంతో ఈ నిబంధనను తప్పనిసరి చేశారు.
సోమనాథ్, శ్రీశైల క్షేత్రాలు భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం, గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రం రెండూ జ్యోతిర్లింగ స్థానాలు కావడం విశేషం.
సోమనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమమైనదిగా పరిగణిస్తారు. ఈ క్షేత్రం ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని, భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. శ్రీశైలం నుంచి ఎంపిక చేసిన 50 మంది భక్తులకు రవాణా, వసతి, దర్శన ఏర్పాట్లను శ్రీశైల దేవస్థానమే దగ్గరుండి పర్యవేక్షిస్తుంది.
{{/usCountry}}సోమనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమమైనదిగా పరిగణిస్తారు. ఈ క్షేత్రం ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని, భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. శ్రీశైలం నుంచి ఎంపిక చేసిన 50 మంది భక్తులకు రవాణా, వసతి, దర్శన ఏర్పాట్లను శ్రీశైల దేవస్థానమే దగ్గరుండి పర్యవేక్షిస్తుంది.
{{/usCountry}}ఈ అరుదైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన యాత్రలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన భక్తులు వెంటనే శ్రీశైలం దేవస్థానం పీఆర్‌ఓ విభాగాన్ని సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.