Steel Plant : రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్.. లక్ష ఉద్యోగాలు
Steel Plant : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి వస్తోంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాయి దిగ్గజ సంస్థలు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ జరగునుంది. కేంద్ర మంత్రులతో కలిసి ప్లాంటుకు మార్చి 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటు కానుంది. లక్ష మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
స్టీల్ ప్లాంట్
{{^htLoading}} {{/htLoading}}
గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో సాకారం కానుందని ప్రభుత్వం చెబుతోంది. అనుబంధంగా రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ వస్తుంది. దీంతో మరో 6 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్ మారనుంది.
జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించనుంది. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌హెచ్-16తో కలిపేలా శరవేగంగా 4 లేన్ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.
సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులు, ఉక్కు సంస్థల ప్రతినిధులు తరలివస్తారు. మధ్యాహ్నం నేరుగా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఎక్స్‌పీరియన్స్ జోన్ సందర్శన, ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ పరిశీలన చేస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరించనున్నారు సీఎం.
సాయంత్రం 4.50 గంటలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. భూమిపూజకు ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు హాజరవుతారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.