Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌.. ఈ జిల్లా నుంచి ప్రారంభించనున్న ప్రభుత్వం!

Telangana Public Schools : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించనుంది. ఈ మేరకు నిధులు మంజూరు చేసింది.

Published on: Mar 22, 2026, 16:19:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) కార్యక్రమం కోసం అదనపు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.16.62 కోట్లు మంజూరు చేసింది.

తెలంగాణ పబ్లిక్ స్కూల్
తెలంగాణ పబ్లిక్ స్కూల్

2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను గజ్వేల్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. గజ్వెల్‌లోని టీపీఎస్ ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు తరగతులతో ప్రారంభమవుతుంది. కాగా 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్నత తరగతులు 2027-28 విద్యా సంవత్సరంలో మొదలవుతాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యా విధానంలో సిఫార్సు చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుండి పూర్తి సదుపాయాలు గల ప్రాంగణాలతో తెలంగాణ పాఠశాలలను(టీపీఎస్) అభివృద్ధి చేయనుంది. సుమారు 1,500 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తూ ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రతిపాదిస్తోంది. టీపీఎస్ కార్యక్రమం కోసం రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన విషయం తెలిసిందే.

తెలంగాణ విద్యా విధానంలో సిఫార్సు చేసిన టీపీఎస్ కార్యక్రమం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందించే పూర్తిస్థాయి సదుపాయాలు గల ప్రాంగణాలుగా మార్చడం ప్రభుత్వ లక్ష్యం.

తెలంగాణలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రేవంత్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో టెన్త్ పరీక్షలు తొలగించేందుకు కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఒకే విధానంలో విద్యాబోధన చేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీబీఎస్ఈ మాదిరిగానే ప్లస్ 2 విధానం అమల్లోకి తీసుకురావాలని అనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.

విద్యా వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ బోర్డు తొలగించే ఆలోచనలో ఉంది సర్కార్. మరోవైపు రాష్ట్రంలో 100కిపైగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చూడుతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఏకీకృత విధానం అమలులోకి రానుంది. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఒకే పాఠశాల ప్రాంగణంలో విద్యను అందించే విధానం అందుబాటులోకి వస్తుంది. ఇది విద్యార్థులపై భారాన్ని తగ్గించనుందని ప్రభుత్వం అనుకుంటోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More