భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం వెంగన్నపాలెంలో 18 ఏళ్ల బీఎస్సీ (నర్సింగ్) మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం సమీపంలోని కొణిజర్ల దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆ యువతి, ఇటీవల ఒక బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సొంతూరుకు వచ్చింది.

చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అడుగులు వేస్తున్న ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తల్లి పనిమీద బయటకు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేరు. సాయంత్రం తల్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనిపించలేదు. ఆందోళనకు గురైన ఆమె చుట్టుపక్కల వారితో కలిసి వెతకగా.. ఇంటి వెనక వైపు ఉన్న బాత్రూమ్ వద్ద ఆ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వారికి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతురాలి ముక్కు నుంచి రక్తం కారడం, మెడ భాగంలో స్పష్టమైన గాయాల గుర్తులు ఉండటంతో పాటు, ఆమెను చున్నీతో దాదాపు మీటరు దూరం వరకు నేలపై ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడం హత్య కోణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ విషాద ఘటన వెనక ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన ఒక యువకుడి హస్తం ఉందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, పక్కింట్లోనే నివాసముంటుండే ఒక యువకుడు గత మూడేళ్లుగా ఆ అమ్మాయిని ప్రేమించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నాడు. తన లక్ష్యం చదువు మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆ యువతి అతని ప్రతిపాదనను పలుమార్లు తిరస్కరించింది.
వేధింపులు ఎక్కువ కావడంతో గతంలో తల్లి ఊరి పెద్దలను ఆశ్రయించింది. ఊరి పెద్దలు సదరు యువకుడిని పిలిచి గట్టిగా హెచ్చరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడనే అనుమానంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}వేధింపులు ఎక్కువ కావడంతో గతంలో తల్లి ఊరి పెద్దలను ఆశ్రయించింది. ఊరి పెద్దలు సదరు యువకుడిని పిలిచి గట్టిగా హెచ్చరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడనే అనుమానంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}సంఘటనా స్థలానికి చేరుకున్న జులూరుపాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి. శ్రీలక్ష్మి నేతృత్వంలోని పోలీస్ బృందం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించింది. 'కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నాం. శాస్త్రీయ ఆధారాల కోసం క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. మరణానికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే స్పష్టమవుతాయి.' అని ఎస్సై పి. శ్రీలక్ష్మి తెలిపారు.
అనుమానితుడైన యువకుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నట్లు సమాచారం. తన బిడ్డను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్న దోషులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.