...
...
Next Story

స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలపైనే.. మార్చి 20 లాస్ట్ డేట్

SVIMS Tirupati Recruitment : స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హతగల అభ్యర్థులు మార్చి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

Published on: Mar 9, 2026, 21:38:07 IST
Advertisement

తిరుపతి శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే అప్లై చేసుకోవాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 20వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి.

స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో ఉద్యోగాలు

మెుత్తం మూడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటి. సెక్యూరిటీ ఆఫీసర్ రెండు.

ఉద్యోగాలకు అర్హతలు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కలిగి ఉండాలి. మెరిటోరియస్ ఎక్స్-ఆర్మీ సిబ్బంది అయి ఉండాలి. A.P పోలీస్ డిపార్ట్‌మెంట్ సీఐ కేడర్‌కు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ అర్హత కావాలి. ఎత్తు - 170 సెం.మీ., ఛాతీ - 81 సెం.మీ. (గాలీ పీల్చినప్పుడు 85 సెం.మీ.). ఆరోగ్యకరంగా ఉండాలి. దృష్టి లోపం ఉండొద్దు. శారీరక, మానసికంగా బలంగా ఉండాలి.

సెక్యూరిటీ ఆఫీసర్‌కు భారత సైన్యంలో (ఎ) సుబేదార్ / జెసిఓ హోదాలో లేదా రక్షణ దళాలలో అసాధారణమైన సేవ రికార్డుతో సమానమైన హోదాలో పనిచేసినవారు కావాలి. ఇక మిగిలిన అర్హతలు పైన చెప్పిన విధంగా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లకు మించకూడదు.

జీతం విషయానికి వస్తే.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు నెలకు రూ.54000 వరకు వస్తుంది. సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.38000 అందిస్తారు.

దరఖాస్తుతో పాటు పంపాల్సినవి

  • నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారమ్
  • వయస్సు రుజువు - SSC సర్టిఫికేట్.
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్.
  • మాజీ సైనికుడు సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • వైద్య అధికారి జారీ చేసిన సేఫ్‌ఓన్ / మంచి శారీరక/మానసిక దృఢత్వం వైద్య ధృవీకరణ పత్రం.
  • అనుభవ ధృవీకరణ పత్రాలు.
  • పాన్ కార్డ్ / ఆధార్ కార్డ్.
  • అదనపు పని అనుభవంతో సహా ఏవైనా ఇతర సంబంధిత సహాయక పత్రాలు.

రిజిస్ట్రార్,

శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)

అలిపిరి రోడ్, తిరుపతి,

తిరుపతి జిల్లా – 517 507

ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.

అప్లికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe