హైదరాబాద్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ నోటిఫికేషన్.. అర్హతలు, జీతం వివరాలు ఇవే

హైదరాబాద్ సిటీ పోలీసులు.. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఖాళీలు తెలంగాణకు చెందినవారికి అందుబాటులో ఉన్నాయి. అర్హతలు, జీతంతోపాటుగా ఇతర వివరాలు తెలుసుకోండి.

Published on: Feb 22, 2026, 20:41:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగర పోలీసులు తాత్కాలిక ప్రాతిపదికన 138 స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్(SPO) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ ఖాళీలు తెలంగాణకు చెందిన మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ సిబ్బంది, రిటైర్డ్ పోలీసు సిబ్బందికి అందుబాటులో ఉన్నాయి .

హైదరాబాద్ పోలీస్ నోటిఫికేషన్
హైదరాబాద్ పోలీస్ నోటిఫికేషన్

హైదరాబాద్ నగర పోలీసుల అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అర్హత ప్రమాణాలు ఇక్కడ ఉన్నాయి. ఈ SPO ఖాళీలు మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ సిబ్బందికి ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందినవారికి ప్రాధాన్యత ఉంటుంది. పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బంది కూడా అప్లై చేసుకోవచ్చు.

  • ఆధార్ కార్డు, ఓటరు ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే నివాస రుజువు ఉండాలి.
  • దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి వయస్సు జనవరి 31, 2026 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
  • గత రెండేళ్లలోపు పదవీ విరమణ చేసిన మాజీ పారామిలిటరీ సిబ్బంది, పోలీసు సిబ్బంది దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, గరిష్ట వయోపరిమితి 62 సంవత్సరాలు.

నెలవారీ గౌరవ వేతనం, సెలవులు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.26,000 గౌరవ వేతనం చెల్లిస్తారు. సెలవులు ఉండవు, ఒకవేళ సెలవులు తీసుకుంటే దానిని జీతంలేని సెలవుగానే పరిగణిస్తారు. అంటే వేతనం కట్ అవుతుంది.

అవసరమైన పత్రాలు

  • అభ్యర్థులు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు కూడా సమర్పించాలి.
  • డిశ్చార్జ్ బుక్/డిశ్చార్జ్ సర్టిఫికేట్/రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎస్బీఐ పాస్‌బుక్ కాపీ, ఓటరు ఐడీ, కుల ధృవీకరణ పత్రంతో సహా అసలు పత్రాలు, జిరాక్స్ కాపీలు ఉండాలి.
  • టెక్నికల్ ట్రెడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అవసరమైన చోట.
  • డ్రైవర్ పోస్టులకు చెల్లుబాటు అయ్యే LMV/HMV డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.

ఆసక్తిగల అభ్యర్థులు హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్‌లోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్(CAR) ప్రధాన కార్యాలయంలో SPO కార్యాలయం వద్ద స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించరు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 5 సాయంత్రం 5 గంటలు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More