జువ్వలదిన్నెలో తమిళనాడు బోట్లు విడుదల ఘటన.. ముగ్గురికి 2.25 కోట్ల జరిమానా!
Juvvaladinne Boats Issue : నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో తమిళనాడుకు చెందిన బోట్ల విడుదల ఘటన వివాదాస్పదమైంది. అయితే తాజాగా బోట్లు విడుదల చేసిన వారికి భారీగా జరిమానా విధించారు.
మార్చి 18 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న జువ్వలదిన్నె మత్స్యకార రేవు నుండి ముగ్గురు వ్యక్తులు నాలుగు యాంత్రిక పడవలను (mechanised boats) విడిపించారు. తమిళనాడులోని కడలూరు, పుదుచ్చేరిలోని కారైకల్‌కు చెందిన మత్స్యకారుల యాజమాన్యంలో ఉన్న ఈ పడవలను, కొన్ని నెలల క్రితం నెల్లూరు జిల్లాలోని కృష్ణపురం, చెన్నాయపాలెం గ్రామాల మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర సముద్ర సరిహద్దులను దాటినప్పుడు ఒకరి పడవలను మరొకరు స్వాధీనం చేసుకోవడం తరచుగా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం జువ్వలదిన్నె మత్స్యకారులు ఆ పడవలను స్వాధీనం చేసుకున్న తర్వాత, వాటిని గ్రామంలోని మత్స్యకార రేవు వద్ద లంగరు వేసి ఉంచారు. ఆ పడవలను పర్యవేక్షించే బాధ్యత ముగ్గురు వ్యక్తులపై ఉంది.
అయితే తాజాగా జువ్వలదిన్నె మత్స్య రేవు నుంచి హై-స్పీడ్ ఫిషింగ్ బోట్లను విడుదల చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమ పాత్రను అంగీకరించిన ముగ్గురు నిందితులైన మత్స్యకారులపై మత్స్యకారుల సంఘ పెద్దలు రూ. 2.25 కోట్ల జరిమానా విధించారు. ఉలవపాడు మండలం, చాకిచెర్ల-పెద్దా పట్టపుపాలెం గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర జలాల్లో మత్స్యకారుల భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు ఈ సమస్యపై చర్చించేందుకు ప్రకాశం, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 164 మంది గ్రామ పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మొదట నిందితులైన మత్స్యకారులను రూ. 5 కోట్ల జరిమానా చెల్లించమని కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందులను పేర్కొంటూ అంత భారీ మొత్తాన్ని చెల్లించలేమని వారు విన్నవించుకున్నారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సంఘ నాయకులు జరిమానాను రూ. 2.40 కోట్లకు తగ్గించారు. చివరకు ఆ మొత్తాన్ని రూ. 2.25 కోట్లకు తగ్గించారు.
ముగ్గురు నిందితుల కుటుంబాలు జరిమానాలో భాగంగా అక్కడికక్కడే రూ.1 కోటి చెల్లించాయని, మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని సంఘ పెద్దలకు హామీ ఇచ్చాయని తెలుస్తోంది. జరిమానా అంశంతో పాటు ఈ సమావేశం ఏకగ్రీవంగా పలు తీర్మానాలను కూడా ఆమోదించింది.
తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని మత్స్యకార సంఘ నాయుకుడు డిమాండ్ చేశారు. పట్టపు కాపు మత్స్యకారుల వర్గాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) కేటగిరీలో చేర్చాలన్న తమ అభ్యర్థన ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని పేర్కొ్న్నారు. తమ హక్కులను పరిరక్షించాలని, పొరుగు ప్రాంతాల నుంచి పడవలు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని కోరారు. చొరబాట్లను అరికట్టడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.
అంతేకాకుండా పడవలు, ఇంజన్లు, చేపల వలలపై 75 శాతం రాయితీ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుతో ఒక ప్రత్యేక పట్టపు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


