రెండు మూడు నెలల క్రితం కొబ్బరి ధరలు ఎంత పెరిగాయో.. ఇప్పుడు అంతకుఅంత తగ్గుతున్నాయి. గత 15 రోజుల్లో చూసుకుంటే.. కొబ్బరికాయల ధరలు సుమారు 50 శాతానికి పైగా పడిపోయాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో పంట బాగా పండడమే డిమాండ్ తగ్గడానికి, ధరలు పతనానికి ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది.

ధరలు మరింత తగ్గడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పండుగ సీజన్ కూడా ముగిసింది. నిజానికి కార్తీక మాసంలో కోనసీమ నుంచి పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయింది. దీపావళి, కార్తీక మాసం అయిపోవడం, మరోవైపు శుక్ర మౌఢ్యమి కారణంగా ధరలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు కేరళ, తమిళనాడులో అధిక దిగుబడి కూడా కోనసీమ కొబ్బరి మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. సంక్రాంతి సీజన్ వరకు కొబ్బరి ధరల్లో పెరుగుదల ఉండకపోవచ్చు. అప్పటి వరకు రైతులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కోనసీమ కొబ్బరి వ్యాపారుల అభిప్రాయం ప్రకారం, కొబ్బరి ధర రూ.26 నుండి రూ.14కి తగ్గింది. 15, 20 రోజుల క్రితం వరకు రోజుకు 100 ట్రక్కులు కొబ్బరి లోడు బయలుదేరేది. ఇప్పుడు ఆ సంఖ్య 20 ట్రక్కులకు పడిపోయింది. కోనసీమ జిల్లా నుండి బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు అవుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా కొబ్బరి మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. తమిళనాడు మార్కెట్ నుంచి అధికంగా రావడం వల్ల కోనసీమ మార్కెట్‌లో ధరలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.
తమిళనాడు రైతులు దిగుబడిని పెంచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కోనసీమలో రైతులు ఇప్పటికీ చెట్ల నుండి కొబ్బరిని తీయడానికి మాన్యువల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అందువల్ల నాణ్యత మీద కూడా ప్రభావం పడుతుంది. తమిళనాడులో 16 జిల్లాల్లో కొబ్బరి సాగు ఉంది.
{{/usCountry}}తమిళనాడు రైతులు దిగుబడిని పెంచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కోనసీమలో రైతులు ఇప్పటికీ చెట్ల నుండి కొబ్బరిని తీయడానికి మాన్యువల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అందువల్ల నాణ్యత మీద కూడా ప్రభావం పడుతుంది. తమిళనాడులో 16 జిల్లాల్లో కొబ్బరి సాగు ఉంది.
{{/usCountry}}ఉత్తరాది రాష్ట్రాలు, తెలంగాణలో రాఖీ, దీపావళి, కార్తీక మాసం, శ్రీరామనవమి, దసరా, ఇతర పండుగల సమయంలో, మహారాష్ట్రలో వినాయ చతుర్థి సమయంలో కొబ్బరికి అధిక డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వెయ్యి పచ్చి కొబ్బరికాయల ధర రూ.12 వేల నుంచి రూ.14 వేల మధ్య పలుకుతోంది. అదే రెండు నెలల క్రితం ఈ ధర రూ.28 వేల వరకు ఉన్నది.
తమిళనాడు మార్కెట్లో కొబ్బరికాయల అదనపు సరఫరా కేవలం ఒక సాకు మాత్రమే అని కొందరు చెబుతున్నారు. తమిళనాడు నుంచి అధిక ఎగుమతుల కారణంగా ధర స్వల్పంగా మాత్రమే పెరిగిందంటున్నారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారనే వాదన కూడా ఉంది.