ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా రైల్వే బోర్డు వల్సాడ్- వేళాంకణి స్పెషల్ ట్రైన్ నెం.09030, ట్రైన్ నెం.09029 వేళాంకణి – దహను రోడ్ నడపడానికి ఆమోదం తెలిపింది.

09030 వల్సాడ్-వేళాంకణి మధ్య 3 జులై 2026 మధ్య వల్సాడ్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. 10 గంటలు ప్రయాణించి మరుసటి రోజు వేళాంకణి చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 09029 వేళాంకణి-దహను రోడ్ 6 జులై 2026 మధ్య నడుస్తుంది. వేళాంకణిలో అర్ధరాత్రి 12.30 గంటలకు బయల్దేరి.. 10.30 గంటలు జర్నీ చేస్తుంది. మరుసటి రోజు దహను రోడ్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు దహను రోడ్, పాల్ఘర్, వసాయి రోడ్, పన్వెల్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలదుతురై, తిరునల్లారు, కారైకాల్, నాగోర్, నాగపట్టినం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ కోచ్‌లు ఉంటాయి.
కాన్పూర్ సెంట్రల్-మధురై రైళ్లు
ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి కాన్పూర్ సెంట్రల్, మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషల్ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తాయి. దీంతో ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు వరంగల్, విజయవాడ మీదుగా వెళ్తాయి.
ట్రైన్ నెంబర్ 01925 కాన్పూర్ సెంట్రల్-మధురై మధ్య 01.07.2026 నుండి 29.07.2026 వరకు నడుస్తుంది. ఈ సర్వీస్ కాన్పూర్ నుంచి బుధవారం ఉదయం 8.15 గంటలకు బయల్దేరి.. శుక్రవారం 7.15కి మధురై చేరుకుంటుంది.
01926 మధురై – కాన్పూర్ సెంట్రల్ ట్రైన్ 04.07.2026 నుండి 01.08.2026 వరకు నడుస్తుంది. శనివారం ఉదయం 02.30 గంటలకు బయల్దేరి.. సోమవారం ఉదయం 04.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది.
{{/usCountry}}01926 మధురై – కాన్పూర్ సెంట్రల్ ట్రైన్ 04.07.2026 నుండి 01.08.2026 వరకు నడుస్తుంది. శనివారం ఉదయం 02.30 గంటలకు బయల్దేరి.. సోమవారం ఉదయం 04.30 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరాయ్, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సలీం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3 ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.