...
...
Next Story

జోగి రమేష్, జగన్‌కు ఉన్న లింకు బయటకు రాబోతుంది : బుద్దా వెంకన్న

కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న లింకులు బయటకు రాబోతున్నాయని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. జోగి రమేష్‌ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.

Published on: Nov 2, 2025, 15:02:29 IST
Advertisement

కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అధికారులు తీసుకెళ్లారు. అయితే తాజాగా జోగి రమేష్ మీద టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. జోగి రమేష్ గురించి ఆలోచన చేయడం సీఎం చంద్రబాబుకు అనవసరం అని వెంకన్న చెప్పారు. జనార్ధన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. విచారణలో మాజీ సీఎం జగన్ పేరు బయటకు వస్తుందన్నారు.

బుద్దా వెంకన్న(ఫైల్ ఫొటో)
బుద్దా వెంకన్న(ఫైల్ ఫొటో)

'చంద్రబాబు, లోకేశ్‌లకు అరెస్టుతో సంబంధం లేదు. జోగి రమేష్ బీసీ కార్డు వేసుకోవడానికి సిగ్గు ఉండాలి. దోచిన ఆస్తులను బీసీలకు పంచి పెట్టాలి. జగన్‌కు కూడా ఈ నకిలీ మద్యం కేసులో పాత్ర ఉంది. మద్యం కుంభకోణం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బు చేరిందని అధికారులు తెలుసుకున్నారు. అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారం గత ప్రభుత్వంలో ఎందుకు బయటపెట్టలేదు.' అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

డైవర్షన్ పాలిటిక్స్, దొంగ ప్రమాణాలు, దోచుకోవడం లాంటివి జగన్‌కు తెలుసు అని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ పెద్ద దొంగ అని, జోగి రమేష్ లాంటి వారు చిన్న దొంగలు అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉంటే రంకెలు వేసే రమేష్.. ఇప్పుడు పోలీసులు వచ్చాక బాత్‌రూమ్‌లో దాక్కున్నారన్నారు. అంతకుముందు దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పిన రమేష్.. ఇప్పుడు చంద్రబాబు కారణంగానే అరెస్ట్ అనడం ఏంటన్నారు.

'జనార్ధన్‌ రావుతో జోగి రమేష్‌కు లింకు ఉంది. ఈ విషయం విచారణలో తేలింది. ఇప్పుడు జోగి రమేష్, జగన్‌కు ఉన్న లింకు బయటకు రాబోతుంది. ఈ కేసు విచారణ పూర్తి కాగానే.. ఇంకా పెద్ద వాళ్ల పేర్లు బయటకు వస్తాయి. వైసీపీ నేతలు.. కల్తీ మద్యం పేరుతో ప్రజలకు స్లో పాయిజన్ ఇచ్చారు. వారి ప్రాణాలు తీసి.. డబ్బులు దోచుకున్నారు. జోగి రమేష్ ఇందులో కీలక నిందితుడు.' అని బుద్దా వెంకన్న ఆరోపించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe