తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు! ఎల్లో హెచ్చరికలు జారీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం.. ఏపీలో పలు ప్రాంతాల్లోని వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇవాళ పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వాతావరణం నెలకొంటుంది. అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని APSDMA స్పష్టం చేసింది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్….
తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి.
ఆగస్టు 21 ఉదయం 08:30 గంటల నుంచి ఆగస్టు 24 ఉదయం 08:30 గంటల వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం లేదా అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బులిటెన్‌లో తెలిపింది. ఈ రోజుల కోసం ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు (యెల్లో లేదా ఆరెంజ్ అలర్ట్లు) జారీ చేయలేదు.
మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం…. హైదరాబాద్ సిటీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో చాలా తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం మాత్రమే ఉంది. నగర పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కావచ్చు. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీచే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

