ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
Cold Wave : లంబసింగిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు... ఇప్పటివరకు ఇదే అత్యల్పం
Cold Wave : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజురోజుకు వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో శనివారం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం కనిష్ట ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. లంబసింగిలో 7.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాది ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని అధికారులు తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని జనాలు తెల్లవారుజామున తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు దట్టమైన పొగమంచు ఉంటుంది. దీంతో వాహనాల్లో వెళ్తుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఘాట్ రోడ్లపై స్థానికులు వాహనాలు నడపడం కష్టంగా మారింది.
లంబసింగి లాంటి ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 నుండి 7 గంటల మధ్య ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయి, పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో బయట తిరగడం లేదా బైక్ ప్రయాణాలు చేయడం మానుకోండి. టూరిస్టులుగా ఈ సమయంలో వెళ్లడం మానుకోవాలి. ఒకవేళ వెళ్తే.. క్యాంపింగ్ టెంట్లలో బస చేసేవారు నేరుగా నేలపై పడుకోకుండా మందపాటి మ్యాట్ లేదా స్లీపింగ్ బ్యాగ్ ఉపయోగించాలి.
చలిమంటలు వేసుకునేటప్పుడు పొగ ఎక్కువగా పీల్చకుండా చూడండి. ముఖ్యంగా మూసి ఉన్న గదుల్లో బొగ్గుల కుంపటి లేదా కట్టెల మంటలు అస్సలు వేయకూడదు. ఒకే మందపాటి స్వెటర్ వేసుకోవడం కంటే 2-3 పలుచని దుస్తులను ఒకదానిపై ఒకటి ధరించడం వల్ల దుస్తుల మధ్య గాలి నిలిచి ఉండి శరీర వేడి బయటకు పోకుండా కాపాడుతుంది.
శరీరంలోని వేడి ఎక్కువగా తల, చేతులు, పాదాల ద్వారా బయటకు పోతుంది. మంకీ క్యాప్, చేతి గ్లౌజులు, ఉన్ని సాక్సులు తప్పనిసరిగా ధరించాలి.
ఒకటి రెండుచోట్ల వర్షాలు
ఇక నవంబర్ 30 నాటికి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజులు కోస్తాంధ్ర, యానాం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది. పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోనూ ఇలాగే ఉండనుంది.

E-Paper
