ఆంధ్రప్రదేశ్ : రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ - ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరమైంది. కేవలం రూ. 100 నామమాత్రపు స్టాంపు డ్యూటీతోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ సేవలు డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. 

Published on: Dec 10, 2025, 14:34:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులకు ఏపీ సర్కార్ చెక్ పెట్టేసింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయటమే కాకుండా అతి తక్కువ ఫీజునే నిర్ణయించింది. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.

రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ (image source Department of Revenue AP Govt)
రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ (image source Department of Revenue AP Govt)

రాష్ట్రవ్యాప్తంగా ఉనఅన అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఈ సేవల ప్రారంభించటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ - ముఖ్యమైన పాయింట్లు:

  • వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న ఇబ్బందులకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 100కే రిజిస్ట్రేషన్ చేసేలా కొన్ని నెలల కిందంటే నిర్ణయం తీసుకుంది.
  • ఈ తరహా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను లభతరం చేయటంతో పాటు రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం జీవో జారీచేసింది.
  • భూయజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • వీలునామా రాయకుండా యజమాని మరణిస్తే వారసులు ఆ ఆస్తులను భాగాలు చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.100, రూ.1000కే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100 చొప్పున నామమాత్రపు స్టాంపు డ్యూటీ చెల్లించాలి.
  • ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.10 లక్షలు మించితే రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
  • రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే… ఆటోమేటిక్‌గా ఆ భూముల యాజమాన్యం వారి పేరు మీదకు వస్తుంది. దీనివల్ల వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయబడతాయి.
  • నామమాత్రపు స్టాంపు డ్యూటీతో చేసుకునే ఈ తరహా రిజిస్ట్రేషన్లు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర ఆస్తులకు వర్తించవు.
  • ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More