పసి వయసులో బడికెళ్లి అక్షరాలు దిద్దాల్సిన ఓ చిన్నారి, చేతిలో కర్ర పట్టుకుని ఆకలితో అడవి బాటపట్టాడు. "నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. అమ్మా నన్ను కాపాడు" అంటూ ఆ పసివాడు కార్చిన కన్నీళ్లు సోషల్ మీడియాను కుదిపేశాయి. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరిగా నరకం అనుభవిస్తున్న ఎనిమిదేళ్ల రామయ్య అనే బాలుడి దీనస్థితిపై తీసిన వీడియో వైరల్ అయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. బాలుడిని సురక్షితంగా కాపాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రచవారిపాలెం సమీపంలో గొర్రెలు కాస్తూ ఎనిమిది సంవత్సరాల రామయ్య అనే బాలుడు కనిపించాడు. ఎండలో నడుస్తూ, తీవ్ర ఆకలితో రోదిస్తున్న ఆ చిన్నారిని చూసి స్థానికులు విచారించగా గుండెతరుక్కుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనకు సరిగ్గా తిండి పెట్టడం లేదని, దెబ్బలు కొడుతున్నారని ఆ బాలుడు ఏడుస్తూ చెప్పాడు.తాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నర్రావాడ గ్రామానికి చెందినవాడనని ఆ చిన్నారి తెలిపాడు. 'మా అమ్మకు ఫోన్ చేసి చెప్పండి.. నన్ను ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్లండి.' అంటూ ఆ పసివాడు అభ్యర్థించిన తీరు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా చలించిపోయేలా చేసింది.
ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్ చేస్తూ సహాయం చేయాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టికి రాగానే ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పసిపిల్లలతో బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం, వారిని వేధించడం తీవ్ర నేరమని పేర్కొన్నారు.
మంత్రి వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రకాశం జిల్లా అధికారులను ఆదేశించారు. బాలుడు ఉన్న ప్రాంతాన్ని వెంటనే గుర్తించి, అతడిని సురక్షితంగా రక్షించాలన్నారు. చిన్నారికి తక్షణమే మంచి ఆహారం, వైద్య పరీక్షలు అందించి, సంరక్షణ కేంద్రంలో రక్షణ కల్పించాలని చెప్పారు.
{{/usCountry}}మంత్రి వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రకాశం జిల్లా అధికారులను ఆదేశించారు. బాలుడు ఉన్న ప్రాంతాన్ని వెంటనే గుర్తించి, అతడిని సురక్షితంగా రక్షించాలన్నారు. చిన్నారికి తక్షణమే మంచి ఆహారం, వైద్య పరీక్షలు అందించి, సంరక్షణ కేంద్రంలో రక్షణ కల్పించాలని చెప్పారు.
{{/usCountry}}చిన్నారిని బలవంతంగా మేకల కాపరిగా మార్చడం వెనుక ఉన్న బాధ్యులు ఎంతటివారైనా సరే వారిపై బాలకార్మిక నిరోధక చట్టం మరియు బాలల సంరక్షణ చట్టాల కింద కఠిన కేసులు నమోదు చేయాలని నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటన బాలకార్మిక వ్యవస్థ పట్ల ఆందోళన కలిగిస్తోంది. చిన్నతనంలోనే పేదరికం, కుటుంబ పరిస్థితులు లేదా దళారుల మాయమాటల వల్ల అనేకమంది పిల్లలు ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారు. చిన్నారి రామయ్య ఉదంతంలో ప్రభుత్వం వేగంగా స్పందించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.