సెల్ఫీ సరదాకు ముగ్గురు మైనరల్ బాలికల ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. సరదాగా వాటర్ ఫాల్స్ లో దిగి అప్పటివరకు సంతోషంగా గడిపిన ఆ బాలికలు… అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. లోతును అంచనా వేయకపోవటంతో… ఉన్నట్టుండి నీళ్లలోకి జారుకుని దుర్మరణం చెందారు.
సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లి…

ప్రాథమిక వివరాల ప్రకారం…. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని మూలగుమ్మి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మైనర్ బాలికలు వేసవి సెలవుల నిమిత్తం సొంతూరుకు వచ్చారు. అయితే జలపాతం దగ్గర సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లారు.
జలపాతంలో కాసేపు నీళ్లలో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలతో సరదాగా గడిపారు. అంతలోనే ఒక అమ్మాయి నీళ్ల లోపలికి జారుకుంది. ఆ తర్వాత మరో ఇద్దరు ఆమెను కాపాడడానికి వెళ్లి వాళ్ళు కూడా మునిగిపోయారు. మరో ఇద్దరు బయటనే ఉండగా…. వాళ్లు తీసిన వీడియోలో ఇదంతా కూడా రికార్డు అయింది. ఓ వైపు అరుపులు అరుస్తుండగా… కాపాడవారు లేక ఆ ముగ్గురు నీళ్లలోనే చనిపోయారు. చనిపోయిన వారిలో త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) ఉన్నారు. వీరంతా ఇంటర్మీడియట్, పదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది.
జలపాతం ఒడ్డున ఉన్న మరో అమ్మాయి వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. వారు వెంటనే జలపాతంలోకి దిగి ముగ్గురు అమ్మాయిలను బయటకు తీశారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అవ్వడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. అయితే వేసవి వేళ జలపాతాలు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హచ్చరిస్తున్నారు. ఈత రాకుండా అసలు దిగవద్దని సూచిస్తున్నారు.
{{/usCountry}}ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. అయితే వేసవి వేళ జలపాతాలు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హచ్చరిస్తున్నారు. ఈత రాకుండా అసలు దిగవద్దని సూచిస్తున్నారు.
{{/usCountry}}