TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఇవాళ ఆర్జిత సేవా టికెట్ల విడుదల, ఈ తేదీలు కూడా తెలుసుకోండి

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఇవాళ ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల విడుదలవుతాయి. టీటీడీ వెబ్ సైట్ నుంచి వీటిని బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 24న 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలవుతాయి.

Published on: Jul 21, 2026, 06:02:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి లక్కీ డిప్ కాకుండా నేరుగా బుక్ చేసుకునే ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఇవాళ(జూలై 21) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా, వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

  • తిరుమల ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం టోకెన్ల కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. దీనితో పాటు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
  • వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు (వ్యాధులు) ఉన్నవారు తిరుమల శ్రీవారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా కల్పించే ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.
  • రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఆ తర్వాత… తిరుమల మరియు తిరుపతిలలో భక్తులు బస చేయడానికి అవసరమైన వసతి గదుల (రూమ్స్) కోటాను అదే రోజు (ఈనెల 24) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

భక్తులు నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని…. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More