Tirumala Tickets : తిరుమల శ్రీవారి టికెట్ల బుకింగ్‌పై సందేహాలా..? TTD కాల్ సెంటర్ నంబర్ ఇదే..
Tirumala Srivari Tickets : తిరుమల శ్రీవారి దర్శనం, వసతి బుకింగ్‌ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. అధికారిక వెబ్‌సైట్, హెల్ప్‌లైన్ నంబర్లను మాత్రమే సంప్రదించాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.
Tirumala Srivari Darshan Tickets : కలియుగ వైకుంఠం తిరుమల గిరులపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే, భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు నకిలీ టికెట్లు, దర్శనం పేరుతో మోసం చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల భద్రతకు, దర్శన టికెట్ల జారీలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదులు, ఆర్జిత సేవల బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని టీటీడీ స్పష్టం చేసింది.

నకిలీ వెబ్‌సైట్లు, దళారుల ఉచ్చులో పడొద్దు…
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారాలను, అనధికారిక వెబ్‌సైట్లను నమ్మి భక్తులు ఎవరూ మోసపోవద్దని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. భక్తుల భక్తిభావనలను, అవసరాలను కొందరు ఆసరాగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్ల ద్వారా…. ఇతర అక్రమ మార్గాల్లో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు తమ విలువైన సొమ్మును దళారుల చేతుల్లో పెట్టి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించారు.
శ్రీవారి దర్శన టికెట్లు, వసతి గదులు, వివిధ సేవల బుకింగ్‌లు, టికెట్ల విడుదల తేదీలు, రద్దు అయిన టికెట్ల లభ్యత, భక్తుల రద్దీ, వేచి ఉండే సమయం వంటి అన్ని ముఖ్యమైన అప్‌డేట్లను టీటీడీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుంది. భక్తులు ఇతరుల మాటలను నమ్మకుండా నేరుగా వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అదనపు ఈవో సూచించారు. వీటితో పాటు టీటీడీ భక్తి ఛానల్ (SVBC) ద్వారా కూడా అధికారిక సమాచారాన్ని నిరంతరం ప్రసారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సందేహాలు ఉంటే చేయాల్సిన నంబర్….
శ్రీవారి దర్శన టికెట్లు లేదా వసతి గదుల బుకింగ్‌లకు సంబంధించి భక్తులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునేందుకు టీటీడీ ఒక ప్రత్యేక కాల్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. భక్తులు నేరుగా టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155257 కు కాల్ చేసి తమ సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ ఉండే ప్రతినిధులు పూర్తి స్థాయి అధికారిక సమాచారాన్ని… స్పష్టతను అందిస్తారు. కాబట్టి అనధికార వ్యక్తుల ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు టీటీడీ గట్టి చర్యలు చేపడుతోంది. ఎవరైనా దళారులు, మధ్యవర్తులు లేదా అనధికార వ్యక్తులు శ్రీవారి దర్శనం, వసతి బుకింగ్‌ల పేరిట మిమ్మల్ని సంప్రదించి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా 9866898630 అనే మొబైల్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే… సదరు దళారులు, మోసగాళ్లపై తక్షణమే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి హెచ్చరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

