...
...
Next Story

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు మాడ వీధుల్లో ఊరేగారు. స్వామివారి దివ్య దర్శనంతో భక్తజనం భక్తిపారవశ్యంలో మునిగితేలారు.

Published on: Oct 18, 2026, 13:32:53 IST
Advertisement

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి వైభవ ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత అట్టహాసంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కోటి సూర్యుల తేజస్సుతో భాసిల్లుతూ శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్రీవారిని కళ్లారా తిలకించిన వేలాది మంది భక్తజనంలో భక్తిపారవశ్యం వెల్లివిరిసింది.

సూర్యప్రభ వాహనం – సకల జీవకోటికి చైతన్యప్రదాత

సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి
సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి

సూర్యభగవానుడు సకల జీవరాశులకు చైతన్యాన్ని, ప్రకృతికి వెలుగును, జీవకోటికి శక్తిని ప్రసాదించే ఆరోగ్యప్రదాతగా పూజలందుకుంటున్నాడు. సూర్యతేజంతోనే చంద్రుడు సైతం ప్రకాశిస్తున్నాడని పురాణాలు పేర్కొంటాయి.

సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి విహారం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం(ఇవాళ) రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, జానకీ దేవి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks