Tirumala Brahmotsavam 2026 : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు - మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం
Tirumala Navaratri Brahmotsavam 2026 Updates : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోవ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు జగన్మోహనాకారంలో మోహినీ అవతారాన్ని ధరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
Tirumala Navaratri Brahmotsavam 2026 Updates : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు జగన్మోహనాకారంలో మోహినీ అవతారాన్ని ధరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన శ్రీవారి రూపాన్ని చూసి భక్తజనం మైమరిచిపోయారు. అదే సమయంలో, స్వామివారికి తోడుగా మరొక తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారి అలంకారంలో మలయప్పస్వామి అభయం అందించారు.

మాడ వీధుల్లో భక్తి పారవశ్యం…..
కోలాహలంగా సాగిన ఈ పల్లకీసేవ ముందర గజరాజులు గంభీరంగా నడిచాయి. భక్తజన బృందాల శ్రావ్యమైన భజనలు, ఉత్సాహభరితమైన కోలాటాలు, జీయ్యంగార్ల వేద ఘోషలు, మంగళవాయిద్యాల దివ్య నాదాల నడుమ స్వామివారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమల మాడ వీధుల్లో అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు పడుతూ స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు.
ఈ మోహినీ అవతారం వెనుక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉంది. జగత్తును ఆవహించిన మాయామోహాలకు అతీతంగా భగవంతుని నైజమైన తత్త్వాన్ని గ్రహించాలని ఈ అవతారం ప్రబోధిస్తుంది. సమస్త విశ్వం ఆ పరమాత్మ లీలా విలాసమేనని, ఆయన దివ్య అనుగ్రహం లభిస్తేనే మానవులు లౌకిక మాయలను అధిగమించి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలరని ఈ పూజ చాటిచెబుతోంది.
ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివార్లు పాల్గొని ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేశారు. టీటీడీ అధికారులలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బోర్డు సభ్యులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో ఈ వేడుకలో భాగమయ్యారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

