TTD Srivani Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు..! ఈ మార్పు తెలుసుకోండి
Tirumala Srivani Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. ఇవాళ శ్రీవాణి టికెట్లను ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala Srivani Tickets : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రోజువారీగా ఆన్ లైన్ లో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్లను ఇవాళ మాత్రం ఆఫ్ లైన్ లో జారీ చేయనున్నట్లు తెలిపింది. సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇవాళ మధ్యాహ్నం నుంచి తిరుమలలోని అన్నమయ్య భవన్ కు ఎదురుగా ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ లో టికెట్లను జారీ చేస్తున్నారు. టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
రేపటి నుంచి ఆన్ లైన్ లోనే…!
రోజువారీ కోటా అయిన 800 టికెట్లు పూర్తి అయ్యే వరకు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు. రేపటి(ఏప్రిల్ 12) నుంచి యథావిధిగా శ్రీవాణి దర్శన కోటా ఆన్ లైన్ లో విడుదల చేయబడుతాయని టీటీడీ స్పష్టం చేసింది. కేవలం ఈరోజుకు మాత్రమే ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుందని వివరించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):
- శ్రీవాణి టికెట్లు అంటే ఏమిటి..?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని త్వరితగతిన దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్లే 'శ్రీవాణి' టికెట్లు.
2. ఈ టికెట్ ద్వారా ఎలాంటి దర్శనం లభిస్తుంది…?
శ్రీవాణి టికెట్ పొందిన వారికి వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పిస్తారు.
3. ఆఫ్‌లైన్‌లో ఎక్కడ తీసుకోవాలి?
తిరుమలలోని అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న శ్రీవాణి కౌంటర్ లో ఈ టికెట్లు లభిస్తాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

