TGSRTC : ఉగాది, రంజాన్ వేళ ప్రత్యేక బస్సులు - టికెట్ ఛార్జీల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ ఏం చెప్పిందంటే..?

TGSRTC Special Buses : ఉగాది, రంజాన్ పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే టికెట్  ఛార్జీలపై ఆర్టీసీ ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది.

Published on: Mar 18, 2026, 06:22:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 17,18తో పాటు 23వ తేదీల్లో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో బస్సు ఛార్జీలు అదనంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది.

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను నడుపుతోందని వివరించింది. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ స్వంత గ్రామాలకు చేరుకునేలా ఈ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

టీజీఎస్ఆర్టీసీ వివరణ ప్రకారం….. ప్రభుత్వ ఉత్తర్వు (GO) నం.16 (2003) ప్రకారం... డీజిల్, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ప్రత్యేక బస్సుల ఛార్జీలను సవరించే అధికారం TGSRTCకి ఉంది. ఈ నిబంధన మేరకు పండుగలూ, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక బస్సుల ఛార్జీలను 1.5 రెట్లు అంటే గరిష్టంగా 50 శాతం వరకు పెంచవచ్చు. దీని ప్రకారం కేవలం ప్రత్యేక బస్సులకు మాత్రమే అత్యధిక రద్దీ ఉండే తేదీలలో అంటే మార్చి 17, 18, 23 తేదీలలో మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. సాధారణ బస్సు సర్వీసుల లో యథావిధిగా ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయి.

యథావిధిగా మహాలక్ష్మి పథకం:

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఈ క్రింది బస్సులలో యధావిధిగా కొనసాగుతుంది:

•పల్లె వెలుగు

•ఎక్స్‌ప్రెస్

•సిటీ ఆర్డినరీ

•మెట్రో ఎక్స్‌ప్రెస్

పండుగ సర్వీసులు, ఛార్జీల గురించి ఖచ్చితమైన సమాచారం కోసం ప్రయాణికులు అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని టీజీఎస్ఆర్టీసీ కోరింది. ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More