TGSRTC: వేసవి వేళ ప్రయాణికులకు శుభవార్త - టికెట్ ధరలు తగ్గించిన ఆర్టీసీ, నేటి నుంచే అమలు
TGSRTC Ticket Rates : జంట నగర వాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ- మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ రేట్లు తగ్గించారు. ఈ నిర్ణయం ఇవాళ్టి(మార్చి 1) నుంచే అమల్లోకి రానుంది.
హైదరాబాద్ లోని జంట నగర వాసులకు ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈ- మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి(మార్చి 1) నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం వేసవి కాలం కావటంతో ఎండలు ముదురుతున్నాయి. ఓవైపు ఉక్కపోత కూడా మొదలైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. అయితే ఉక్కబోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
- నగరంలో తిరిగే మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో కిలోమీటర్లకు గాను టికెట్ ఛార్జీ రూ.30గా ఉండేది. కానీ ఇప్పుడు దానిని రూ.25కి తగ్గించారు.
- ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో నాలుగు కిలోమీటర్లకు గాను రూ.35 చొప్పున టికెట్ ధర ఉండేది. తాజా నిర్ణయంతో రూ.25కి తగ్గింది.
- ఈ మెట్రో ఏసీ బస్సుల్లో ఏకంగా రూ.10 మేర తగ్గింది.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 275 మెట్రో డీలక్స్, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు సేవలు అందిస్తున్నాయి.
- తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది ప్రయాణికులు ఈ బసుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

