అరుణాచలం వెళ్లే వారికి గుడ్ న్యూస్ - హైదరాబాద్ నుంచి ఇక రెగ్యులర్ రైళ్లు, తాజా మార్పులివే

అరుణాచలం వెళ్లే వారికి రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ఇక హైదరాబాద్ నుంచి రెగ్యులర్ రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు తెలంగాణ, ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

Published on: Feb 28, 2026, 11:58:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా తమిళనాడులోని అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వెళ్తున్నారు. పౌర్ణమి వేళ ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. కొందరు ట్రైన్స్, మరికొందరు సొంత వాహనాల్లో అరుణాచలం వెళ్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.... రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని నాంపల్లి నుంచి కన్యాకుమారి మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను రెగ్యులర్ సర్వీస్ గా క్రమబద్ధీకరించింది.

ఇక రెగ్యులర్ రైళ్లు (ఫైల్ ఫొటో)
ఇక రెగ్యులర్ రైళ్లు (ఫైల్ ఫొటో)

ట్రైన్ నెంబర్ మార్పు….

గత ఐదు సంవత్సరాలుగా నాంపల్లి - కన్యాకుమారి(ట్రైన్ నెంబర్ 07229/07230) ఎక్స్ ప్రెస్ వీక్లీ రైళ్లుగా రాకపోకలు సాగిస్తోంది. అయితే ఇకపై ఈ ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ సర్వీస్ గా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ట్రైన్ నెంబర్ ను మార్చారు. రెగ్యులర్ సర్వీస్ గా మారిన నేపథ్యంలో నాంపల్లి - కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ నెంబర్ 17069/17070గా మార్పు చేశారు.

హైదరాబాద్ నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 5:20 నిమిషాలకు బయలుదేరే (ట్రైన్ నంబర్ 17069) ఎక్స్ ప్రెస్ రెండో రోజు ఉదయం 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 05:15 నిమిషాలకు కన్యాకుమారి నుంచి (ట్రైన్ నంబర్ 17070) ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. ఈ ట్రైన్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

నాంపల్లి నుంచి అరుణాచలం వెళ్లే రెగ్యులర్ ఎక్స్ ప్రెస్…. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై స్టేషన్ల మీదుగా కన్యాకుమారి చేరుకుంటుంది. రెగ్యులర్ సర్వీస్ గా మార్పు చేయటంతో భక్తులకు ఎంతో ఊరట చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More