తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం - ముత్యపు కవచంలో శ్రీవారి దర్శనం

Tirumala Jyesthabhishekam 2026 : తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు విశేషమైన ముత్యపు కవచాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను తన్మయత్వంలో ముంచెత్తారు.

Published on: Jun 27, 2026, 18:53:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అపురూపమైన ముత్యపు కవచాన్ని ధరించి భక్తులను మురిపించారు. ఏడాది పొడవునా వివిధ కవచాల్లో దర్శనమిచ్చే స్వామివారు, సంవత్సరంలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఈ ముత్యపు కవచాన్ని అలంకరించుకోవడం ఈ వేడుక ప్రత్యేకత.

ముత్యపు కవచంలో భక్తులను మురిపించిన శ్రీ మలయప్పస్వామి…
ముత్యపు కవచంలో భక్తులను మురిపించిన శ్రీ మలయప్పస్వామి…

అంతకుముందు శనివారం ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా 'మహాశాంతి హోమం' నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని అర్చకులు కన్నులపండుగగా చేపట్టారు.

భక్తులను మురిపించిన శ్రీ మలయప్పస్వామి…

ఇవాళ సాయంత్రం వేళలో శ్రీ మలయప్పస్వామివారికి పరమ పవిత్రమైన ముత్యపు కవచ సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది. అనంతరం జరిగిన సహస్రదీపాలంకార సేవలో స్వామివారు దేవేరులతో కలిసి ముత్యపు కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. సుందరమైన ముత్యాల వెలుగుల్లో మెరిసిపోతున్న స్వామివారి ముగ్ధమనోహర రూపాన్ని చూసి మాడ వీధులలో వేచి ఉన్న వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందారు.

శాస్త్రోక్తంగా జరిగిన ఈ విశేష ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి పాల్గొన్నారు. వీరితో పాటు టీటీడీ అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భ‌క్తులు పాల్గొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More