Tirumala : శ్రీవారి హుండీ మిశ్రమ బియ్యం ఈ-వేలం.... మీరు ఇలా పాల్గొనొచ్చు..!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. ప్రధాన ఆలయంతో ఇతర అనుబంధ ఆలయాల హుండీ ద్వారా భక్తులు సమర్పించిన 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని జూలై 7న ఈ-వేలం వేయనుంది. ఆసక్తి గలవారు రూ.50,000 ఈఎండీ చెల్లించి పాల్గొనవచ్చు.

Published on: Jun 23, 2026, 13:07:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిపై ఉన్న భక్తిప్రపత్తులతో భక్తులు తిరుమల ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయాల హుండీలలో నగదు, బంగారంతో పాటు పెద్ద ఎత్తున బియ్యాన్ని కూడా కానుకగా సమర్పిస్తుంటారు. ఇలా హుండీ ద్వారా భక్తులు మొక్కుబడిగా సమర్పించిన మిశ్రమ బియ్యాన్ని ఈ-వేలం (ఆన్‌లైన్ వేలం) ద్వారా విక్రయించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

జూలై 7న ఈ-వేలం….

మొత్తం 20 లాట్లుగా ఉన్న 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని 2026 జూలై 7వ తేదీన ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది. ఈ వేలానికి సంబంధించిన ఆక్షన్ ఐడీ నంబర్ 26120 గా అధికారులు కేటాయించారు.

ఈ బహిరంగ ఆన్‌లైన్ వేలంలో పాల్గొనాలని భావించే వ్యాపారులు లేదా ఆసక్తి గల వ్యక్తులు రూ.50,000 ధరఖాస్తు రుసుముగా (ఈఎండీ - Earnest Money Deposit) ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఏపీ ప్రభుత్వ కొనుగోలు అధికారిక వెబ్‌సైట్ http://konugolu.ap.gov.in ను సందర్శించవచ్చు.

వెబ్‌సైట్‌తో పాటు నేరుగా వివరాలు తెలుసుకోవడానికి కూడా టీటీడీ అధికారులు అవకాశం కల్పించారు. తిరుపతిలోని టీటీడీ వేలాల విభాగం జనరల్ మేనేజర్ (జి.ఎమ్) కార్యాలయాన్ని ఫోన్ నంబర్ 0877-2264429 ద్వారా కానీ… లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ఐడీ ద్వారా కానీ సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో) ఒక ప్రకటనలో వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More