...
...
Next Story

Tirumala Vaikunta Dwara Darshan : నవంబర్ 27న తిరుమల వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

Tirumala Vaikunta Dwara Darshan : శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. తిరుమల వైకుంఠద్వార దర్శన టికెట్లను నవంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా వెల్లడించింది.

Published on: Nov 24, 2026, 05:59:10 IST
Advertisement

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను నవంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. మెుదటి రెండు రోజులు డిప్ విధానంలో టికెట్లు ఇస్తారు. ఆ తర్వాత 8 రోజులు నేరుగా వచ్చేవారికి ఎటువంటి టోకెన్ లేకుండానే తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. డిసెంబర్ 20వ తేదీన వైకుంఠ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మేరకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. 10రోజుల పాటు రోజుకు 15వేల చొప్పున రూ.300 టికెట్లు ఇస్తారు.

పౌర్ణమి గరుడ సేవ రద్దు

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు.

ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

ప్రతి నెలా టీటీడీ పౌర్ణమినాడు నిర్వహించే గరుడ సేవను ఈ సందర్భంగా రద్దు చేసింది. అదే విధంగా కార్తీక దీపోత్సవం కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను కూడా ఆ రోజు రద్దు చేసింది.

నవంబరు 30న కార్తీక మహాదీపోత్సవం

మహాదీపోత్సవంలో భాగంగా దీప ప్రజ్వలన విశిష్టతను చాటుతూ ప్రత్యేక పూజలు, శ్రీనివాస అర్చన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ మహాలక్ష్మీ పూజ నిర్వహించనున్నారు. అనంతరం హరిహర కార్తీక నృత్య రూపకం, భక్తిగీతాలాపన, అష్టలక్ష్మీ వైభవం నృత్య ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. చివరగా కుంభహారతి, నక్షత్రహారతి, మంగళహారతి సమర్పించనున్నారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks