...
...
Next Story

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. సిట్ ఎదుట ధర్మారెడ్డి.. వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు!

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.

Published on: Nov 11, 2025, 17:22:16 IST
Advertisement

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణను వేగవంతం చేస్తోంది. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. చాలా సేపు ధర్మారెడ్డిని సీబీఐ డీఐజీ విచారించారు. బుధవారం కూడా టీటీడీ మాజీ ఈవోను విచారించే అవకాశాలు ఉన్నాయి.

తిరుపతి లడ్డూ వివాదం
తిరుపతి లడ్డూ వివాదం

వైసీపీ హయాంలో ఈవోగా ఉన్న సమయంలో భారీ మెుత్తంలో కల్తీ నెయ్యి లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై ధర్మారెడ్డికి సిట్ ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ధర్మారెడ్డి పదవి కాలంలో టెండర్లు, సరఫరా, రిపోర్టుల గురించి అధికారులు అడిగారు. సిట్ విచారణ నుంచి ధర్మారెడ్డి బయటకు వెళ్లారు. అయితే ఈ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ ఆయనకు తిరుపతి లడ్డూ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ధర్మారెడ్డి తీసుకోలేదని తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన కుదరకపోతే.. 15వ తేదీన హాజరు అవుతానని సమాధానం ఇచ్చారు సుబ్బారెడ్డి. కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యి అని తేలినా.. పట్టించుకోలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సుబ్బారెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించే దిశగా కూడా సిట్ అడుగులు వేస్తోంది.

లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టుగా సీబీఐ గుర్తించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన పాల సంస్థ 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లపాటు టీటీడీకి రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు తర్వాత సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం వివరాలను సేకరించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe