...
...
Next Story

Tobacco Auctions : ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు వేలం మార్చి 25 నుంచి.. ధరలపై ఈ ప్రభావం ఉంటుందా?

Tobacco Auctions : ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు కొనుగోలు తేదీలు ఖరారు అయ్యాయి. మార్చి 25వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రారంభం అవుతుంది.

Published on: Mar 8, 2026, 15:26:58 IST
Advertisement

ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాలను కవర్ చేసే దక్షిణ ప్రాంతం, నార్తర్న్ లైట్ సాయిల్స్ ప్రాంతంలో 16 వేలం వేదికలు ఉన్నాయి. అయితే 2026 పొగాకు వేలం సీజన్‌ను రెండు దశల్లో ప్రారంభించాలని పొగాకు బోర్డు నిర్ణయించింది. వాటాదారులతో జరిగిన సమావేశంలో పొగాకు బోర్డు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పొగాకు వేలం
పొగాకు వేలం

మొదటి దశ మార్చి 25న దక్షిణ ప్రాంతంలోని కందుకూరు-1, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతుంది. నార్తర్న్ లైట్ సాయిల్స్ ప్రాంతంలోని ఐదు వేలం ప్లాట్‌ఫామ్‌లు కూడా అదే రోజు వేలం ప్రారంభిస్తాయి. ఇక రెండో దశలో సదరన్ లైట్ సాయిల్స్‌లోని మిగిలిన ప్లాట్‌ఫామ్‌లలో ఏప్రిల్ 9 నుండి వేలం ప్రారంభమవుతుంది.

గత మూడు సీజన్లలో మెరుగైన రాబడి వచ్చింది. మార్కెట్లో మంచి ధరలు లభించడంతో రైతులు ఈ సంవత్సరం పొగాకు సాగును విస్తరించారని అధికారులు తెలిపారు. అంతేకాదు మెుంథా తుపాను ఎఫెక్ట్, శనగకు ధర సరిగా లేకపోవడంలాంటి కారణాలతో రైతులు దీని సాగు వైపే మెుగ్గుచూపారు.

2025-26 సీజన్‌లో పొగాకు బోర్డు 88.88 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. అయితే అంచనాల ప్రకారం ఉత్పత్తి 147.30 మిలియన్ కిలోలకు చేరుకుంటుంది. ఇది అనుమతించబడిన పరిమాణం కంటే దాదాపు 58.42 మిలియన్ కిలోలు ఎక్కువ. ప్రకాశం జిల్లాలోని సాగుదారులు అనుకూల ధరలను ఆశిస్తున్నారు.

అయితే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌లతో కూడిన ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, ముడి చమురు ధరలు పెరగడం, ఇతర దేశాలలో పొగాకు ఉత్పత్తి పెరగడం వల్ల వేలం మీద ప్రభావం పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe