ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ముగ్గురు చనిపోయారు. ఈ విషాదఘటన నరసారావుపేట.. లాడ్జిలో జరిగింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నాదెండ్ల మండలం సాతులూరుగా చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీ ప్రాణాలు తీసుకున్నది. ఏం సమస్య వచ్చిందో తెలియదుగానీ.. మూడేళ్ల చిన్నారితోపాటుగా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన డాక్టర్ గోపి కుటుంబం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నివాసం ఉంటోంది. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అతడి భార్య శంకర కుమారి నర్సుగా చేస్తోంది. వీరికి మూడేళ్ల చిన్నారి మౌనిక ఉంది.
ఈ కుటుంబం శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చింది. ఆ తర్వాత ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారితోపాటుగా దంపతులిద్దరూ ప్రాణాలను తీసుకున్నారు. ఏం కష్టం వచ్చిందో ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆదివారం గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది.. తలుపులు బద్దలు కొట్టి చూశారు. ఈ విషయాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. గదిని నిశితంగా పరిశీలించారు. మత్తు ఇంజెక్షన్ తీసుకుని.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పదేళ్ల బాలుడి హత్య
కృష్ణా జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. శనివారం రాత్రిపూట ఈ ఘటన జరగింది. స్థానికంగా కలకలం రేపింది. నానమ్మ లక్ష్మీతో కలిసి పదేళ్ల బాలుడు బాలాజీ ఇంట్లో నిద్రిస్తున్నాడు. దుండగులు వచ్చి దాడికి పాల్పడ్డారు.
ఈ కారణంగా బాలాజీ చనిపోయాడు. నానమ్మ లక్ష్మీకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వృద్ధురాలి పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. సిమెంట్ రాళ్లతో బాలుడు, వృద్ధురాలిని బలంగా కొట్టినట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు అనే విషయం తెలియాల్సి ఉంది.
{{/usCountry}}ఈ కారణంగా బాలాజీ చనిపోయాడు. నానమ్మ లక్ష్మీకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వృద్ధురాలి పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. సిమెంట్ రాళ్లతో బాలుడు, వృద్ధురాలిని బలంగా కొట్టినట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు అనే విషయం తెలియాల్సి ఉంది.
{{/usCountry}}