...
...
Next Story

మదనపల్లెలో దారుణం.. ఏడేళ్ల బాలికను చంపి డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కిన సైకో!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏడేళ్ల బాలికను చంపేశాడు. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు.

Published on: Feb 17, 2026, 14:15:29 IST
Advertisement

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘోరం జరిగింది. కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక శవంగా కనిపించింది. పొరుగువారి ఇంటి ముందు డ్రమ్ములో విగతజీవిగా పడి ఉంది. పక్కింటి కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో డ్రమ్ములో మృతి చెంది కనిపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా మదనపల్లెలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణంగా హత్య చేశారు. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కలవారు కూడా బాలిక కోసం వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కీలక విషయం తెలుసుకున్నారు.

బాలిక మిస్సింగ్‌తో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. పక్కింటి కులవర్ధన్ బాలికను తీసుకెళ్లాడు. దీంతో అందరూ కలిసి వెళ్లి బాలిక కోసం వెతికారు. చివరకు బాలిక మృతదేహం డ్రమ్ములో కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మదనపల్లెలో విషాదం నెలకొన్నది.

కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సైకోలాగా ప్రవర్తిస్తాడని స్థానికులు అంటున్నారు. బాలిక ఇంటి పక్కనే ఉండే కులవర్ధన్ మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని డ్రమ్ములు కుక్కాడు. అత్యాచారం జరిగిందా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం జరిగిన తర్వాత బాలిక మరణానికి కారణాలు చెబుతామని పోలీసులు అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe