వరుస మరచి ప్రవర్తించిన అన్నకు జీవిత ఖైదు.. సొంత చెల్లిపై అత్యాచారం, బలవంతపు పెళ్లి.. ఆపై!

విజయవాడలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత చెల్లిపై అత్యాచారం చేశాడు అన్న. ఆ తర్వాత పెళ్లి చేసుకుని గర్భవతిని చేశాడు. అతడికి తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది.

Published on: Feb 10, 2026, 17:31:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంత చెల్లినే ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి.. ఆమెను బెదిరిస్తూ.. ఈ దారుణాలు చేశాడు. అంతేకాదు ఆమెను గర్భవతిని చేశాడు. ఈ కేసులో విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దోషిగా తేలిన యువకుడికి చనిపోయేంతవరకు జైలుశిక్షని విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చెల్లిపై అత్యాచారం చేసిన అన్నకు జీవిత ఖైదు
చెల్లిపై అత్యాచారం చేసిన అన్నకు జీవిత ఖైదు

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల తరువాత తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి తన కుమార్తెలతో పమిడిముక్కల మండలం మంటాడలో నివసిస్తోంది. తండ్రి తన 21 ఏళ్ల కొడుకుతో కలిసి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో స్థిరపడ్డాడు.

2023లో నిందితుడు తన తల్లి, చెల్లెళ్లను కలిసేందుకు మంటాడకు వచ్చాడు. ఆ సమయంలో తన 17 ఏళ్ల పెద్ద చెల్లితో సన్నిహితంగా ఫోటోలు తీశాడు, ఆమెను బెదిరించడం మెుదలుపెట్టాడు. అంతేకాదు సొంతచెల్లిపైనే అనేకసార్లు అత్యాచారం చేశాడు. డిసెంబర్ 2024లో క్రిస్మస్ సందర్భంగా తిరిగి మళ్లీ వచ్చాడు. మళ్లీ అలాగే బెదిరింపులు చేసేవాడు. బాధితురాలని విజయవాడలోని ఒక చర్చికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను వివాహం చేసుకున్నాడు.

తరువాత బాధితురాలని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమెపై లైంగిక వేధింపులు కొనసాగించాడు. ఈ విషయాల గురించి తెలియక తల్లి తన కొడుకుతో చెల్లెను ఇంటికి పంపించమని కోరింది. గతేడాది ఫిబ్రవరిలో తండ్రీకొడుకులు ఆమెను ఒంగోలు బస్ స్టాండ్ వద్ద వదిలి హైదరాబాద్ తిరిగి వెళ్లారు. ఇంటికి చేరుకున్న తర్వాత అమ్మాయి జ్వరం, వాంతులతో అస్వస్థతకు గురైంది. వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతి అని తేలింది. ఎలా జరిగిందని ప్రశ్నించగా.. బాధితురాలు తన రెండేళ్ల బాధను తల్లికి వివరించింది.

తల్లి ఫిర్యాదు ఆధారంగా.. పమిడిముక్కల పోలీసులు పోక్సో చట్టంతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ వి. ధీరజ్ వినీల్ నిందితుడిని పెట్లూరులో అరెస్టు చేసినట్టుగా తెలిపారు. ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేసింది. తాజాగా విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. రూ.6,000 జరిమానా విధించి, బాధితురాలికి రూ.30,000 చెల్లించాలని ఆదేశించింది. బాలికకు వీలైనంత త్వరగా ప్రభుత్వ సహాయం రూ.5లక్షలు అందేలా చూడాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More