గుంజి గుంజి బూతు పాట కాంట్రవర్సీ.. నటుడు చంద్రహాస్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు!
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, సినిమా నటుడు చంద్రహాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు పాడిన పాట గుంజి గుంజి చుట్టూ రెండు మూడు రోజులుగా వివాదం నడుస్తోంది.
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ మెుదటి సినిమా నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాడు. మెుదటి సినిమా విడుదలకు ముందు స్టేజీపై అతడు చేసిన పనులకు యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. చంద్రహాస్‌కు సంబంధించిన వీడియోలు అప్పట్లో మీమ్ పేజీలు తెగ వాడేసుకున్నాయి. అయినప్పటికీ అతడు ఎక్కడా తగ్గలేదు. నేను ఇంతే అన్నట్టుగా చెప్పేశాడు.

అయితే తాజాగా చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాడిన పాట గుంజి గుంజి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తోంది. రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మెుత్తం ఈ విషయం గురించే ఎక్కువగా టాపిక్. పెద్ద పెద్ద వ్యక్తులు సైతం చంద్రహాస్ పాడిన పాటపై మండిపడుతున్నారు. అదేంపాట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనిపై నటుడు చంద్రహాస్ ఓ వీడియో విడుదల చేశాడు. తను సారీ చెప్పినట్టుగా లేదని కూడా ఈ వీడియో మీద విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియోలో చంద్రహాస్ గతంలో తనను కూడా బూతులతో తిట్టారని, కానీ రియాక్ట్ కాలేదని చెప్పాడు. క్రిటిసిజంలా తీసుకున్నానని తెలిపాడు. పాటలోని బూతులు ఒరిజనల్ సాంగ్‌లో లేవని చెబుతున్నాడు చంద్రహాస్. కేవలం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి తానే సృష్టించినట్టుగా వెల్లడించాడు.
తన పాటను ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినవారు అభినందించారని, క్లాప్స్ కొట్టారని చంద్రహాస్ అన్నాడు. మరోవైపు దీనిపై సీనియర్ జర్నలిస్టు అశోక్ వేములపల్లి స్పందించారు. ఆ పాట ఏంటి, ఆ బూతులు ఏంటి అని గట్టిగా ప్రశ్నించారు. దీనిపై కూడా చంద్రహాస్ మాట్లాడాడు. తన ఇంట్లోవాళ్లను అశోక్ వేములపల్లి అన్నారని, 24 గంటల్లో సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు.
'24 గంటల్లో సారీ చెప్పకపోతే నీకు ఉంటది. మా లాయర్లతో మాట్లాడుతున్నాను.' అంటూ కామెంట్స్ చేశాడు చంద్రహాస్. బెదిరించినట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశాడు. దీనిపై అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ ఠాణాలో కేసు నమోదైంది.
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ వారుసుడిగా చంద్రహాస్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రామ్ నగర్ బన్నీ మూవీతో హీరోగా మారాడు. సినిమా కంటే ముందు తన ప్రవర్తనతో యాటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్‌ను నెటిజన్ల నుంచి అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి గుంజి గుంజి అనే పాటతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


