...
...
Next Story

మార్చి 3న టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేత.. కారణం ఇదే

మార్చి 3న టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు నకిలీ వెబ్‌సైట్‌లపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Updated on: Feb 25, 2026, 22:25:28 IST
Advertisement

మార్చి 3వ తేదీ మంగళవారం రోజున చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్‌లో గల ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్‌, అలాగే శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు.

నకిలీ వెబ్‌సైట్ల మోసం

తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమైంది. కేరళకు చెందిన భక్తుడు సి.కె. సురేష్ బాబు తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి చేతిలో మోసపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో, టీటీడీ విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది.

విచారణలో తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలు, టీటీడీ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించారు. గూగుల్ సెర్చ్‌లలో ఈ ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తూ, భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తేలింది.

ఈ నేపథ్యంలో నకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు టీటీడీ ఐటీ విభాగం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే టీటీడీ చిహ్నాలు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks