రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి, ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న వేద పండితులకు ప్రభుత్వం సంభావన చెల్లిస్తానని మాట ఇచ్చింది. ఇప్పటి వరు 600 మంది ఉన్నట్టుగా గుర్తించారు. దేవాదాయ శాఖ వేద పండితులకు రూ.3 వేల చొప్పున అందిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల నుంచి నిధులను సమకూరుస్తోంది.

ఇది కాస్త భారం కావడంతో ఈ పథకానికి టీటీటీ ద్వారా నిధులు కేటాయించాలని దేవాదాయ శాఖ కమిషనర్ కోరారు. టీటీడీ బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇక సంభావన పథకానికి టీటీటీ ద్వారా నిధులు రానున్నాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు ఇచ్చారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు ఉంటాయి.
శ్రీవారికి హుండీ విరాళం
తిరుమల శ్రీవారికి శుక్రవారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన సాయిసురేష్ ఈ మేరకు హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నానికి అందించారు. రాగి, ఇత్తడితో కలిపి తయారుచేసిన ఈ హుండీ బరువు 70 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.2.50 లక్షలు అని దాత తెలిపారు. తాము 1821 సంవత్సరం నుండి వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని వెల్లడించారు.
{{/usCountry}}తిరుమల శ్రీవారికి శుక్రవారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన సాయిసురేష్ ఈ మేరకు హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నానికి అందించారు. రాగి, ఇత్తడితో కలిపి తయారుచేసిన ఈ హుండీ బరువు 70 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.2.50 లక్షలు అని దాత తెలిపారు. తాము 1821 సంవత్సరం నుండి వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని వెల్లడించారు.
{{/usCountry}}