Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Updated on: Aug 4, 2026, 20:35:52 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెప్టెంబర్ 15 నుండి 23వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేశారు. ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

ఆగస్టు 17 నుంచి 19 వరకు టీటీడీలో వస్త్రాల ఈ-వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగస్టు 17 నుంచి 19 వరకు ఈ-వేలం ద్వారా వేలం వేయనున్నారు. ఈ వేలంలో 177 లాట్లలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. టర్కీ టవళ్లు, ఆర్డినరీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, న్యాప్‌కిన్లు, హ్యాండ్‌కర్చీఫ్‌లు, పిల్లో కవర్లు, బ్లౌజ్‌పీస్‌లు, దుపట్టాలు, పరదాలు, హుండీ గలీబులు, ఈర్వాడాలు తదితర వస్త్రాలను ఈ-వేలంలో విక్రయిస్తారు.

వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం(వేలములు) 0877-2264429ను సంప్రదించవచ్చు. అలాగే www.konugolu.ap.gov.in మరియు www.tirumala.org వెబ్‌సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చు.

తిరుపతి, 2026 ఆగస్టు 04: టీటీడీ ఆధ్వర్యంలోని కార్వేటినగరం శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 25 నుంచి 27వ తేదీ వరకు భక్తి పారవశ్యాన్ని పంచే శ్రీ స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

వేణుగోపాలస్వామివారి దివ్య తెప్పోత్సవాలు

తెప్పోత్సవాల్లో భాగంగా ఆగస్టు 25న శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ఆగస్టు 26, 27 తేదీల్లో శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నారు. ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వేణుగోపాలస్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఆహ్వానిస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More