Kangana Ranaut: ఈ హిందూ యువతులు ఎందుకూ పనికి రారు.. తండ్రులు సంపాదించిన డబ్బుతో జల్సాలు: కంగనా సంచలన పోస్ట్
Kangana Ranaut: కంగనా రనౌత్ మరోసారి సంచలన పోస్ట్ చేసింది. కొందరు హిందూ యువతులు ఎందుకు పనికి రారని, తండ్రులు సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తారని, వాళ్లు మురికి అని ఆమె పోస్ట్ చేయడం గమనార్హం.
అKangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో భారీ వివాదానికి తెరలేపారు. నేటితరం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన కొంతమంది హిందూ యువతులను ఉద్దేశించి ఆమె 'జెనరేషన్ గట్టర్' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యత లేకుండా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

గతంలో కూడా జెన్ జీ (Gen Z) యూత్ ప్రవర్తనపై విమర్శలు గుప్పించిన ఈ నటి.. ఇప్పుడు మరోసారి పాశ్చాత్య పోకడలపై ఓపెన్ నోట్ రాసుకొచ్చారు.
బాధ్యత లేని స్వేచ్ఛ దండగ.. కంగనా ఇన్‌స్టాగ్రామ్ నోట్
కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ.. స్వతంత్రంగా ఎదిగిన ఉద్యోగినులను అనుకరించాలని చూస్తున్న కొంతమంది యువతుల ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉందన్నారు. స్వేచ్ఛను కష్టపడి సంపాదించుకోకుండా కేవలం హక్కుల గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు.
నిజంగా స్వతంత్రంగా బతికే మహిళలు కష్టపడి పైకొస్తారని, వాళ్లు బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటారని కంగనా కొనియాడారు. సొంత కాళ్లపై నిలబడే మహిళలు ఏదీ తల్లిదండ్రుల డబ్బుతో చేయరని, తమ నిర్ణయాలకు తామే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు.
"వాళ్లు జెనరేషన్ గట్టర్".. డ్రగ్స్, ఆల్కహాల్‌పై ఫైర్!
సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని కొత్తతరం భారతీయ మహిళలు తయారయ్యారని కంగనా మండిపడ్డారు. "వాళ్లు చదువుల్లో సరిగ్గా రాణించలేరు. పోనీ ఇల్లు చక్కబెట్టుకునే గృహిణులుగా మారే అర్హత కూడా వారికి లేదు" అని సెటైర్లు వేశారు.
తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడుతూ డ్రగ్స్, ఆల్కహాల్, బాడీ కౌంట్స్ అంటూ ఫ్యాషన్ పేరుతో జల్సాలు చేయడాన్ని కొందరు గొప్పగా ఫీలవుతున్నారని ఫైర్ అయ్యారు. నిజమైన ఇండిపెండెంట్ లైఫ్ సాధించకుండా బాధ్యత లేకుండా బతకాలనుకుంటే వాళ్లు 'గట్టర్ చాప్' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
జెన్ జీ రీల్స్‌పై గతంలో వివాదాస్పద కామెంట్స్
యువతపై కంగనా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. రీసెంట్‌గా నీట్ (NEET) పేపర్ లీక్ ఆందోళనల సమయంలో జెన్ జీ యూత్ చేసిన వైరల్ రీల్స్‌పై కూడా ఆమె సంచలన కామెంట్స్ చేశారు.
ఆ రీల్స్ చూస్తే తనకు డిజిటల్ డిటాక్స్ చేసుకోవాలనిపించిందని కంగనా ఎద్దేవా చేశారు. తమను తాము బొద్దింకలతో పోల్చుకుంటూ చెత్తను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారని ఆమె ఆ సమయంలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంగనా కెరీర్.. పొలిటికల్, సినిమా అప్‌డేట్స్
కంగనా సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ఈ మధ్యే తన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మనోజ్ తపాడియా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా 2008 ముంబై తీవ్రవాద దాడుల్లో కామా హాస్పిటల్ నర్సులు, సిబ్బంది చేసిన సాహసాల ఆధారంగా తెరకెక్కింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలతోనే కాదు తరచూ ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ తోనూ ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


