జూలై 9న మేల్‌చాట్ వ‌స్త్రాలకు టీటీడీ ఈ-వేలం.. ఇలా పాల్గొనాలి

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం జూలై 9న మేల్‌చాట్ వ‌స్త్రాలను టీటీడీ ఈ వేలం వేయనుంది. ఇందులో ఎలా పాల్గొనాలో చూడండి.

Published on: Jul 1, 2026, 12:00:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్ వస్త్రాలను జూలై 9న ఈ వేలం(ఆన్‌లైన్‌లో) వేయనున్నారు. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 47 లాట్లు ఉన్నాయి. ఆసక్తిగల బిడ్డర్లు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

పదవి విరమణ రోజునే రిటైర్మెంట్ బెనిఫిట్స్

టీటీడీలో సుదీర్ఘ కాలం సేవలు అందించి పదవి విరమణ పొందిన వారికి రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. టీటీడీలో వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన 122 మంది ఉద్యోగులకు సామూహిక సన్మానం కార్యక్రమాన్ని మహతి ఆడిటోరియంలో నిర్వహించారు.

టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనంద రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ముందుగా టీటీడీ ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీలో ఉద్యోగులు పదవి విరమణ అయ్యాక సన్మానం చేసే కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలా లేక శాఖల వారీగా చేయాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వివిధ శాఖల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ అయ్యాక వారిని గౌరవించి, వారికి అందే ఫలాలను అదే రోజు వారి ఖాతాల్లో జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజూ సరాసరి 75 వేల పైచిలుకు భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులను ఈవో అభినందించారు.

ఈ సందర్భంగా జేఈవో డా.ఎ.శరత్ మాట్లాడుతూ.. జూన్ 30న 122 మంది టీటీడీ ఉద్యోగులు పదవి విరమణ పొందుతున్నారని, వారిని సమిష్టిగా పండుగ వాతావరణంలో సన్మానించాలని టీటీడీ ఈవో ఆలోచనలు మేరకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. టీటీడీలో పదవి విరమణ పొందిన వారిని సన్మానించడం మహా సేవగా మాట్లాడారు. తొలిసారి సామూహిక సన్మానం కార్యక్రమాన్ని చేపట్టాలని ఈవో సూచించారని గుర్తు చేశారు. పరిమిత సమయంలో టీటీడీ మానవ వనరులు శాఖ, సంక్షేమం శాఖ ఘనంగా ఏర్పాట్లు చేయడంపై నిర్వాహకులను జేఈవో అభినందించారు.

ఈ సందర్భంగా సీవీఎస్వో కేవి.మురళీకృష్ణ మాట్లాడుతూ.. పదవి విరమణ పొందిన వారిని ఒకే వేదికపై సన్మానించే కార్యక్రమాన్ని చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన 122 మందికి ఒక్కొక్కరికి శ్రీవారి లడ్డూ, వడ, అమ్మవారి కుంకుమ, పసుపు, రవికె, అక్షింతలు, తీర్థం, శాలువా ఇచ్చి సత్కరించారు. అనంతరం ఈవోను టీటీడీ ఉద్యోగులు సత్కరించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పదవి విరమణ పొందిన ఉద్యోగులు తమ ఇళ్లకు చేర్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More