తిరుమలలోని శ్రీవారి గరుడ వాహన సేవ 2026 సంవత్సరంలో జరిగే తేదీలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. ఏయే తేదీల్లో వాహన సేవ జరుగుతుందో తెలిపింది. అలాగే రద్దు చేసిన తేదీలు, కారణాలు కూడా వెల్లడించింది.
గరుడ వాహన సేవ తేదీలు
- 01-05-2026 (శుక్రవారం)
- 31-05-2026 (ఆదివారం)
- 29-06-2026 (సోమవారం)
- 29-07-2026 (బుధవారం)
- 28-08-2026 (శుక్రవారం)
- 26-09-2026 (శనివారం)
- 26-10-2026 (సోమవారం)
గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు, కారణాలు
- 24-11-2026 (మంగళవారం)-కార్తీక పర్వ దీపోత్సవం
- 24-12-2026 (గురువారం)-అధ్యయనోత్సవం
శ్రీ అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవ మహోత్సవాలు
తిరుపతి జిల్లా నారాయణవనం మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి పూజ, అంకురార్పణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు వాహనసేవలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాహన సేవల విశేషాలు (ప్రతి రోజు రాత్రి 07.30 గం.లకు)
ఏప్రిల్ 22 – సింహ వాహనం
ఏప్రిల్ 23 – హంస వాహనం
ఏప్రిల్ 24 – శేష వాహనం
ఏప్రిల్ 25 – నంది వాహనం
ఏప్రిల్ 26 – గజ వాహనం
ఏప్రిల్ 27న రాత్రి 07.30 గం.లకు రథోత్సవం కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 28న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగుతుంది. రూ.500 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలు అందజేస్తారు.
{{/usCountry}}ఏప్రిల్ 27న రాత్రి 07.30 గం.లకు రథోత్సవం కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 28న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగుతుంది. రూ.500 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలు అందజేస్తారు.
{{/usCountry}}ఏప్రిల్ 29న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఏప్రిల్ 30న కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించి.. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటం, భక్తిసంగీతం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరచనున్నాయి.
స్థల పురాణం
నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. అనంతరం శ్రీ అగస్త్య మహర్షులు వేద ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అనే పేరు వచ్చిందని టీటీడీ చెబుతోంది.