తిరుమలలో రథసప్తమికి సర్వం సిద్ధం - భక్తులకు 14 రకాల వంటకాలతో అన్నప్రసాదాలు
రథసప్తమికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో జనవరి 24 నుంచి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని రద్దు చేసింది. రథ సప్తమి రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూను సిద్ధం చేసింది.
జనవరి 25వ తేదీన నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

ముఖ్యమైన వివరాలు:
- జనవరి 25వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు.
- ఎక్కువమంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.
- రథ సప్తమి రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూ తయారీ. గ్యాలరీల్లోని భక్తులందరికీ 85 ఫుడ్ కౌంటర్ల ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు అన్న ప్రసాదాలు అందేలా ప్రత్యేక ప్రణాళికలు.
- వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకుల సేవలు వినియోగం.
- 1300 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.
- పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భక్తులకు అవసరమై సమాచారాన్ని వివిధ భాషల్లో అందజేత.
- గత సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ 1900 ట్రిప్పులను నడిపారు. ఈ సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2300 ట్రిప్పులను నడిపేందుకు చర్యలు.
- శ్రీవారి వాహనసేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు.
- వాహన సేవల ముందు 56 రకాల కళా రూపాలను 1000 కళాకారులతో ప్రదర్శన.
- గ్యాలరీల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి. ఇందుకు అవసరమైన అదనపు సిబ్బంది ఏర్పాటు.
- భక్తులకు అత్యవసర సేవలందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలు సిద్ధం.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారం.
వాహన సేవల వివరాలు:
• సూర్య ప్రభ వాహనం – ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు
• చిన్న శేష వాహనం – ఉదయం 9 నుండి 10 గంటల వరకు
• గరుడ వాహనం – ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
• హనుమంత వాహనం – మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు
• చక్రస్నానం – మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు
• కల్పవృక్ష వాహనం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు
• సర్వభూపాల వాహనం – సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు
• చంద్రప్రభ వాహనం – రాత్రి 8 నుండి 9 గంటల వరకు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

