తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరిగే పంచమితీర్థానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా బుధవారం తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారెను తీసుకువచ్చే ఊరేగింపు మార్గంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవాలు, పంచమితీర్థం ఏర్పాట్లపై జేఈవో సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
"తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించే పడి సారె మన ప్రాచీన ధార్మిక సంప్రదాయాలకు, తిరుమల–తిరుచానూరు ఆలయాల మధ్య ఉన్న పవిత్ర అనుబంధానికి ప్రతీక," అని జేఈవో డా. శరత్ తెలిపారు. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఏనుగుపై ఊరేగింపు.. పసుపు మండపం మీదుగా ఆలయానికి
శ్రీవారి పడి సారె ఊరేగింపు మార్గంలో చేపట్టిన ట్రయల్ రన్ తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ వినాయకస్వామివారి ఆలయం వద్ద ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది ఏనుగుపై సారెను తీసుకువెళుతూ నగరంలోని ప్రధాన మార్గాల్లో పర్యటించారు.
శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజూర్ కార్యాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతిపురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
{{/usCountry}}శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజూర్ కార్యాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతిపురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
{{/usCountry}}ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.