Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల, పూర్తి షెడ్యూల్ ఇదే

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్‌ కోటాను విడుదల చేయనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి

Published on: Sep 12, 2026, 15:23:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. రాబోయే డిసెంబర్ నెలకు సంబంధించిన పలు రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, అంగప్రదక్షిణం టోకెన్లు, గదుల కేటాయింపునకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా విడుదలకు పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

ఈ సేవా టికెట్లు పొందేందుకు భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. డిప్‌లో ఎంపికైన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత రుసుము చెల్లిస్తే టికెట్లు ఖరారవుతాయి.

  • కల్యాణోత్సవం, వర్చువల్ సేవల కోటా : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు పుష్పయాగం సేవల టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అదే రోజు (ఈ నెల 22న) మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉంచనుంది.
  • అంగప్రదక్షిణం టోకెన్లు : ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయి. టీటీడీ వెబ్ సైట్ నుంచి వీటిని బుకింగ్ చేసుకోవాలి.
  • శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం : ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
  • దివ్యాంగులు, వయోవృద్ధుల కోటా : వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు కేటాయించే ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం - వసతి గదులు : ప్రతి నెలా అత్యధికంగా భక్తులు ఎదురుచూసే డిసెంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లోని అద్దె గదుల బుకింగ్ కోటా కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుంది.

శ్రీవారి సేవల్లో పాల్గొనాలని భావించే భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ( https://ttdevasthanams.ap.gov.in ) ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More